Site icon aksharatoday.in

TG EDCET RESULTS | టీజీ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల

TG EDCET RESULTS

TG EDCET RESULTS | టీజీ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల

అక్షరటుడే, వెబ్​డెస్క్​: TG EDCET RESULTS | తెలంగాణ ఎడ్​సెట్​ ఫలితాలు Edcet Results 2025 విడుదలయ్యాయి. ఈ మేరకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి పరీక్ష ఫలితాలను రిలీజ్​ చేసింది.

ఎడ్ సెట్‌కు మొత్తం 38,754 మంది దరఖాస్తు చేసుకోగా.. 32,106 మంది పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 30,944 మంది (96.38 శాతం) అభ్యర్థులు అర్హత సాధించారు. జూన్​ ఒకటో తేదీన పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ప్రవేశ పరీక్ష ద్వారా బీఈడీ కోర్సుల్లో 2025–26 విద్యా సంవత్సరానికి తొలి సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు.

Exit mobile version