అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tesla | ప్రపంచంలోనే ప్రఖ్యాతి గాంచిన టెస్లా భారత మార్కెట్లోకి (Indian Market) అధికారికంగా ప్రవేశించింది. ఇండియాలో తన తొలి షోరూంను ముంబైలో మంగళవారం ప్రారంభించింది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని మేకర్ మాక్సిటీ మాల్ (Maker Maxcity Mall)లో ఏర్పాటు చేసిన కార్ల కంపెనీ షోరూంలో.. అత్యధిక ఆదరణ పొందిన Y మోడల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్(Elon Musk)కు చెందిన టెస్లా తన మోడల్ Y ఎలక్ట్రిక్ వాహనాలు ఇండియాలో విక్రయాలకు ఉంచింది. దీని ధర రూ.60 లక్షలు (సుమారు $70,000).
Tesla | వెల్‌కమ్ టు ఇండియా..
ప్రీమియం ఎలక్ట్రిక్ వెహికిల్ కార్ల కంపెనీ టెస్లాకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ (Maharashtra CM Devendra Fadnavis) స్వాగతం పలికారు. ముంబైలో ఏర్పాటు చేసిన కార్ల షోరూంను ఆయన మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. వెల్‌కం టు ఇండియా అని టెస్లాను ఆహ్వానించారు.
Tesla | రూ.60 లక్షలకు పైగానే..
భారత్ మార్కెట్‌లోకి ప్రవేశించిన టెస్లా.. మోడల్ Y SUV విడుదలతో విక్రయాలను ప్రారంభించనుంది. దీని ధర రూ.60 లక్షలుగా కంపెనీ అధికారిక వెబ్‌సైట్ లో పేర్కొంది. లాంగ్-రేంజ్ వేరియంట్ ధర రూ. 68 లక్షలుగా తెలిపింది. అమెరికా, చైనా, జర్మనీ వంటి దేశాల్లో ఈ మోడల్ ధరలు తక్కువే ఉన్నప్పటికీ, దిగుమతి సుంకాల కారణంగా ఇండియాలో రేటు ఎక్కువగానే ఉంది. షాంఘై (చైనా)లోని టెస్లా గిగాఫ్యాక్టరీలో తయారయ్యే మోడల్ Y కార్లను ఇండియాకు దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయించనుంది.