అక్షరటుడే, వెబ్‌డెస్క్: Terror attack | జమ్మూకాశ్మీర్‌లో jammu and Kashmir జరిగిన ఉగ్రదాడిలో మృతుల సంఖ్య పెరిగింది. పహల్గామ్లో టూరిస్టులపై terrorists ఏడుగురు ఉగ్రవాదులు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. వీరిలో 27 మంది పౌరులు మృతి చెందినట్లు సమాచారం. మరికొందరు బుల్లెట్ గాయాలతో ఆస్పత్రిలో hospital చికిత్స treatment పొందుతున్నారు. అయితే ఉగ్రదాడి జరిగిన ప్రాంతంలో భద్రతా బలగాలు security forces కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. కాగా.. ఉగ్రదాడిని జమ్మూకాశ్మీర్ సీఎం ఓమర్ అబ్దుల్లా, లెఫ్టినెంట్ గవర్నర్ ఖండించారు.
Terror attack | అమిత్ షాకు ప్రధాని మోదీ ఫోన్
జమ్మూకాశ్మీర్‌లో Jammu and Kashmir ఉగ్రదాడి ఘటనపై ప్రధాని మోదీ prime Minister Modi స్పందించారు. సౌదీలోని జెడ్డా పర్యటనలో ఉన్న ఆయన హోంమంత్రి అమిత్‌షాకు home Minister amit Shah ఫోన్ చేశారు. ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉగ్రదాడి జరిగిన స్థలానికి వెళ్లాలని అమిత్‌షాను amit Shah ఆదేశించారు. దాడికి పాల్పడ్డవారిపై కఠిన చర్యలు తీసుకోవాని ఆదేశించారు. ఈ నేపథ్యంలో అమిత్‌షా amit Shah అధ్యక్షతన సమావేశమైన ఉన్నతాధికారులు officials సమావేశమయ్యారు. తదుపరి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నట్లు సమాచారం.