అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tenth results : ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు (10th Results) నేడు( బుధవారం) విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేష్ (Minister Nara Lokesh) ఫలితాలు విడుదల చేయనున్నారు.
విద్యార్థులు తమ ఫలితాలను https://bse.ap.gov.in, https://apopenschool.ap.gov.in/, మనమిత్ర వాట్సాప్, లీప్ యాప్‌లోనూ చూసుకోవచ్చు. వాట్సప్ నంబరు 9552300009కు హాయ్ అని మెసేజ్ చేసి, విద్యా సేవల ఆప్షన్ ద్వారా ఫలితాలను పీడీఎఫ్ కాపీ రూపంలో పొందొచ్చు. ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్మీడియట్ ఫలితాలను సైతం విడుదల చేయనున్నారు.