More
    Homeఆంధ్రప్రదేశ్​Kethireddy Pedda Reddy | తాడిపత్రిలో ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్

    Kethireddy Pedda Reddy | తాడిపత్రిలో ఉద్రిక్తత.. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అరెస్ట్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Kethireddy Pedda Reddy | అనంతపురం జిల్లా (Anantapur district) తాడిపత్రిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు కేతిరెడ్డి పెద్దారెడ్డిని (Kethireddy Pedda Reddy) పోలీసులు అరెస్ట్​ చేశారు. ఏడాది తర్వాత ఆయన తన ఇంటికి రాగా.. తమ అనుమతి లేకుండా వచ్చారని పోలీసులు అరెస్ట్​ (Police Arrested) చేసి అదుపులోకి తీసుకున్నారు.

    Kethireddy Pedda Reddy | అల్లర్లతో అనుమతి నిరాకరాణ

    ఏపీలో అసెంబ్లీ ఎన్నికల (AP assembly elections) అనంతరం తాడిపత్రిలో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. దీంతో తాడిపత్రికి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో ఆయన ఏడాదిగా తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్లలేదు. అయితే తనను పోలీసులు తాడిపత్రి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని ఆయన హైకోర్టును (High Court) ఆశ్రయించారు. దీంతో తాడిపత్రి వెళ్లడానికి ఆయనకు న్యాయస్థానం షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఆయనకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది. అయితే పోలీసులు కోర్టు ఆదేశాలు (Court Orders) పాటించడం లేదంటూ ఇటీవల ఆయన మళ్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో సడెన్​గా ఆయన తాడిపత్రిలోని తన ఇంటికి వెళ్లారు.

    READ ALSO  School of Excellence Centers | బీసీ గురుకుల విద్యార్థినులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్‌.. స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ సెంటర్లకు ఆమోదం

    Kethireddy Pedda Reddy | అనంతపురం తరలింపు

    తాడిపత్రిలోని (Tadipatri) తన ఇంట్లో ఉన్న పెద్దారెడ్డి పోలీసులు అరెస్ట్​ చేశారు. తన ఇంట్లో తాను ఉంటే తప్పేంటని పెద్దారెడ్డి వారితో వాగ్వాదం చేశారు. అయినా బలవంతంగా అదుపులోకి తీసుకొని మాజీ ఎమ్మెల్యేను అనంతపురం (Anantapur) తరలించారు. అల్లర్లు జరుగుతాయనే ముందస్తు జాగ్రత్తలతో పెద్దారెడ్డిని పట్టణం నుంచి తీసుకు వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు ఆయన ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. ప్రస్తుతం తాడిపత్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

    Latest articles

    Turmeric Board inauguration | పసుపు బోర్డు కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన అమిత్​షా

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Turmeric Board inauguration | కేంద్ర హోం మంత్రి అమిత్​షా (Union Home Minister Amit...

    DS Statue | డీఎస్​ విగ్రహావిష్కరణపై పీసీసీ చీఫ్​ కీలక వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: DS Statue | పీసీసీ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్​ నేత డి.శ్రీనివాస్(డీఎస్​)​విగ్రహాన్ని నిజామాబాద్​లో కేంద్ర మంత్రి...

    Jagadish Reddy | ఆ మీడియా హౌస్​ల పనిపడతాం.. మాజీ మంత్రి జగదీశ్​రెడ్డి సంచలన వ్యాఖ్యలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Jagadish Reddy | కేసీఆర్​ క్షమించినా.. తాము మాత్రం ఎల్లో మీడియాను వదిలిపెట్టమని మాజీ...

    Char Dham Yatra | చార్​ధామ్ యాత్ర నిలిపివేత

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Char Dham Yatra | ఉత్తరాఖండ్ (Uttarakhand)​లో భారీ వర్షాలు (Heavy Rains) పడుతున్నాయి. వర్షాలు,...

    More like this