అక్షరటుడే, వెబ్డెస్క్ : Encounter | ఛత్తీస్‌గఢ్ – తెలంగాణ Chhattisgarh – Telangana సరిహద్దులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ములుగు mulugu జిల్లాలోని కర్రెగుట్టల్లో karre guttallo తుపాకుల మోత మోగుతోంది. కాగా కర్రెగుట్టల్లో భారీగా మావోయిస్టులు maoists ఉన్నారని సమాచారం అందడంతో తెలంగాణ, చత్తీస్గఢ్ పోలీసులతో సీఆర్పీఎఫ్ బలగాలు రెండు రోజులుగా కూంబింగ్ coombing చేపడుతున్నాయి. ఈ అడవుల్లో హిడ్మా దళం hidma dalam ఉన్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
Encounter | లేఖ విడుదల చేసి..
మావోయిస్టులు ఇటీవల కర్రెగుట్టల చుట్టు బాంబులు bombs పెట్టామని లేఖ విడుదల చేశారు. గిరిజనులు ఎవరు అడవుల్లోకి రావొద్దని, కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులపై ఎన్కౌంటర్లు ఆపాలని ఆ లేఖలో కోరారు. ఈ క్రమంలో భద్రతా బలగాలు రెండు రోజులుగా ఆ గుట్టల్లో గాలింపు చర్యలు చేపట్టాయి.
Encounter | ముగ్గురు మావోయిస్టుల మృతి
కర్రెగుట్టల్లో మావోయిస్టులు, కేంద్ర బలగాలకు మధ్య భీకర కాల్పులు fire exchange చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకు ఎన్‌కౌంటర్ encounter లో ముగ్గురు మావోయిస్టులు three maoists మృతి చెందినట్లు తెలిసింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. కాగా హెలికాప్టర్లు helicapter, డ్రోన్ల dronesతో కేంద్ర బలగాల దాడులు చేస్తున్నాయి. కాల్పులు విరమించాలని పౌర హక్కుల నేతలు కోరుతున్నారు.
Encounter | ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్
ఛత్తీస్‌గఢ్ Chhattisgarh లోని బీజాపూర్ bijapoor జిల్లా ధర్మ తాళ్లగూడెంలో గురువారం ఎన్‌కౌంటర్ చోటు చేసుకుంది. ఈ కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు.