అక్షరటుడే, వెబ్డెస్క్ : Terror Attack | ఢిల్లీ Delhiలోని పాక్ హై కమిషనర్ కార్యాలయం(Pakistan High Commission office) వద్ద ఉద్రిక్తత నెలకొంది. పహల్గామ్ ఉగ్రదాడి pahalgam terror attack నేపథ్యంలో పాక్ ఎంబసీ అధికారులు కేక్ కట్ చేసుకొని సంబరాలు చేసుకున్నట్లు వార్తలు రావడంతో ప్రజలు భారీగా అక్కడికి చేరుకున్నారు. కశ్మీర్ Kashmirలో ఉగ్రమూకలు సృష్టించిన ఘటన యావత్ ప్రపంచాన్ని కదిలించింది. ఈ ఘటనలో 28 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. దేశం దిగ్భ్రాంతిలో ఉన్నవేళ పాక్ హై కమిషనర్ కార్యాలయంలోనికి ఓ సిబ్బంది కేక్ cake తీసుకెళ్లాడు. దీంతో ఉగ్రదాడిపై కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నట్లు వార్తలు ప్రచారం కావడంతో ప్రజలు అక్కడికి చేరుకొని ఆందోళన చేస్తున్నారు. పాకిస్తాన్ pakistanకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పోలీసులు భారీ కేడ్లు అడ్డుపెట్టి ఆందోళనకారులు లోనికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో ప్రజలు అక్కడే బైఠాయించి నిరసన తెలుపుతున్నారు.
