అక్షరటుడే, ఇందూరు: TUWJ – IJU : టీయూ డబ్ల్యూజే – ఐజేయూ అనుబంధ సంఘం తెలంగాణ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ (టీఈఏంఏ) Telangana Electronic Media Association (TEMA) నిజామాబాద్ జిల్లా పూర్తి స్థాయి కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. టీఈఎంఏ జిల్లా అధ్యక్షులుగా ఎస్.రాజేశ్వర్(రాజేష్), ఉపాధ్యక్షులుగా సాయిరామ్ (బాల్కొండ), అఖిల్ అహ్మద్, దశరత్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా నవీన్(అమ్మ న్యూస్) నియమితులయ్యారు.
ఇక ప్రధాన కార్యదర్శి గా ఎస్.ధనుంజయ్ (సీవీఆర్), సహాయ కార్యదర్శులుగా అరుణ్ (నిజామాబాద్ రూరల్), చిరంజీవి (ఆర్మూర్), సురేశ్ మహా (బోధన్), కోశాధికారిగా పీ అనిల్ (ఏబీఎన్)ను ఎన్నుకున్నారు.
TUWJ – IJU : జిల్లా కార్యవర్గ సభ్యులుగా..
జిల్లా కార్యవర్గ సభ్యులుగా శ్యామ్ (భీమ్గల్), శేఖర్ (బాల్కొండ), అశోక్ (బిగ్ టీవీ), శ్రీనివాస్ (ఆర్మూర్), జగన్ (బోధన్), వెంకటేష్ (నందిపేట్), ప్రమోద్ (లోకల్ టీవీ) లను ఎన్నుకున్నారు. ఈ నూతన కమిటీ రెండు సంవత్సరాల పాటు కొనసాగుతుందని టీయూడబ్ల్యూజే – ఐజేయూ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సంజీవ్ తెలిపారు. జిల్లాలో ఎలక్ట్రానిక్ మీడియా సమస్యలపై కమిటీ స్పందించి కార్యాచరణ నిర్వహించాలని జిల్లా అధ్యక్షులు కోరారు.