More
    HomeజాతీయంTelegram CEO | టెలిగ్రామ్​ సీఈవో సంచలన ప్రకటన.. వీర్యదానంతో పుట్టిన వంద మందికి ఆస్తిలో...

    Telegram CEO | టెలిగ్రామ్​ సీఈవో సంచలన ప్రకటన.. వీర్యదానంతో పుట్టిన వంద మందికి ఆస్తిలో వాటా

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Telegram CEO | టెలిగ్రామ్‌ వ్యవస్థాపకుడు, సీఈవో పావెల్‌ దురోవ్‌ (CEO Pavel Durov) సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను వంద మంది పిల్లలకు తండ్రినని ఆయన గతంలో చెప్పారు. తాజాగా ఆ పిల్లలందరికి తన ఆస్తిలో వాటా ఇస్తానని ప్రకటించారు.

    తాను 15 ఏళ్ల పాటు వీర్యదానం చేయడంతో 12 దేశాల్లో 100 మంది పిల్లలు జన్మించినట్లు గతేడాది జూలైలో పావెల్(Pavel)​ ప్రకటించారు. తాజాగా ఆయన మరో సంచలన విషయాన్ని వెల్లడించారు. ఇటీవల తాను వీలునామా రాశానని ఆయన పేర్కొన్నారు. తాను సహజంగా జన్మనిచ్చిన సంతానంతో పాటు ఈ 100 మంది పిల్లలకు కూడా తన ఆస్తిలో సమాన హక్కు ఉంటుందని వీలునామా(Will)లో రాసినట్లు తెలిపారు. దాదాపు 20 బిలియన్‌ డాలర్ల తన సంపదను వీరందరికీ సమానంగా పంచుతానని చెప్పారు. అయితే ఆయన ఇందులో ఓ కండిషన్​ కూడా పెట్టారు. 30 ఏళ్ల వరకు వారు ఈ సంపద పొందలేరని చెప్పారు.

    READ ALSO  G7 Summit | ఉగ్ర‌వాదంపై ద్వంద వైఖ‌రికి తావులేదు.. జీ7 స‌ద‌స్సులో ప్ర‌ధాని మోదీ స్ప‌ష్టీక‌ర‌ణ‌

    Telegram CEO | పెళ్లి కాకుండానే..

    టెలిగ్రామ్​ సీఈవో(Telegram CEO)కు వివాహం కాలేదు. అయితే తనకు ముగ్గురు సహజీవన భాగస్వాములు ఉన్నట్లు ఆయన చెప్పారు. వారితో తనకు ఆరుగురు సంతానం ఉన్నారని తెలిపారు. తనకు ఎంతో మంది శత్రువులు ఉన్నారని, అందుకే 40 ఏళ్ల వయసులోనే వీలునామా రాసినట్లు పావెల్​ చెప్పుకొచ్చారు.

    Latest articles

    Ex Mla Jeevan Reddy | కాంగ్రెస్​ అవినీతి బాగోతాలను బయటపెడతాం: మాజీ ఎమ్మెల్యే జీవన్​ రెడ్డి

    అక్షరటుడే, ఆర్మూర్​: Ex Mla Jeevan Reddy | కాంగ్రెస్​ అవినీతి బాగోతాలను వరుసగా బయటపెడతామని నిజామాబాద్​...

    BC Sakshema Sangham | బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడిగా అజయ్

    అక్షరటుడే ఇందూరు: బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడిగా బగ్గలి అజయ్​ను నియమిస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం జిల్లా...

    Apple Foldable iPhone | ఆపిల్ నుంచి తొలి ఫోల్డ‌బుల్ ఫోన్‌.. 2026 నాటికి వ‌చ్చే అవ‌కాశం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Apple Foldable iPhone | ప్ర‌పంచంలోనే అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ ఆపిల్ నుంచి త‌న తొలి...

    Operation Sindoor | కాల్పుల విర‌మ‌ణ మా ప్ర‌తిపాద‌నే.. పాకిస్తాన్ ఉప‌ ప్ర‌ధాని వెల్ల‌డి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ :Operation Sindoor | ప‌హ‌ల్గామ్ ఉగ్ర‌దాడికి వ్య‌తిరేకంగా భార‌త్ చేప‌ట్టిన ఆప‌రేష‌న్ సింధూర్‌తో బెంబేలెత్తిన పాకిస్తాన్(Pakistan)...

    More like this