ePaper
More
    Homeబిజినెస్​Telecom Companies | మరోసారి టారిఫ్‌ల మోతకు సిద్ధమవుతున్న టెలికాం సంస్థలు.. 12 శాతం ఛార్జీలు...

    Telecom Companies | మరోసారి టారిఫ్‌ల మోతకు సిద్ధమవుతున్న టెలికాం సంస్థలు.. 12 శాతం ఛార్జీలు పెరిగే అవకాశం

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Telecom Companies | టెలికాం(Telecom) కంపెనీలు మరోసారి టారిఫ్‌ల మోత మోగించడానికి సిద్ధమవుతున్నాయి. ఒకటి రెండు నెలల్లో లేదా ఈ ఏడాది చివరి నాటికి వినియోగదారులపై భారీగా రీఛార్జ్(Recharge) భారం మోపే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. రీఛార్జ్​ ప్లాన్ల ధరలను 12 శాతం వరకు పెంచే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.

    మే నెలలో దేశంలో మొబైల్‌ యాక్టివ్‌ యూజర్ల (Mobile active users) సంఖ్య రికార్డు స్థాయిలో పెరిగింది. ఆ నెలలో 74 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్లు వచ్చారు. దీంతో దేశంలో మొత్తం యాక్టివ్‌ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 108 కోట్లకు చేరింది. లాభాలను పెంచుకోవాలని ఆలోచిస్తున్న టెలికాం సంస్థలు.. రీఛార్జ్ ప్లాన్ల ధరలను మార్చాలని ఆలోచిస్తున్నాయని ప్రముఖ బ్రోకరేజీ సంస్థ జెఫరీస్‌ పేర్కొంది.

    READ ALSO  Stock Market | రోజంతా ఊగిసలాట.. చివరికి లాభాలతో ముగిసిన సూచీలు

    Telecom Companies | గతేడాది 10 నుంచి 27 శాతం పెంపు

    గత ఏడాది జులై(Last year July)లో టెల్కోలు టారిఫ్‌ పెంపును ప్రకటించాయి. ముందుగా ఎయిర్‌టెల్‌ (Airtel) రీఛార్జ్ ప్లాన్ల రేట్లు పెంచగా.. జియో(Jio) కూడా భారీగానే వడ్డించింది. వొడాఫోన్‌ ఐడియా కూడా వీటి బాటలోనే పయనించింది. ఆయా సంస్థలు 10 నుంచి 27 శాతం వరకు ప్లాన్ల రేట్లను పెంచాయి. దీంతో అప్పట్లో పలువురు వినియోగదారులు టెల్కోల తీరుపై నిరసన తెలపడం కోసం రీఛార్జ్ ప్లాన్లను మార్చని ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్‌ఎన్‌ఎల్‌(BSNL)కు పోర్ట్‌ అయ్యారు. దీంతో రెండు మూడు నెలలపాటు ప్రధానంగా జియో భారీగా సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. ఈ క్రమంలో 2024 ఏప్రిల్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌కు 86.8 మిలియన్ల సబ్‌స్క్రైబర్లు ఉండగా.. ఆ ఏడాది సెప్టెంబర్‌ నాటికి 91.8 మిలియన్లకు పెరిగారు. అయితే నెట్‌వర్క్‌ సమస్యతో బీఎస్‌ఎన్‌ఎల్‌ సబ్‌స్క్రైబర్లు తగ్గారు.

    READ ALSO  Today gold price | మ‌ళ్లీ పెరుగుతున్న బంగారం ధ‌ర‌లు.. నేడు ఎంత ఉన్నాయంటే..!

    ఇదే సమయంలో జియో, ఎయిర్‌టెల్‌లు క్రమంగా తిరిగి సబ్‌స్క్రైబర్స్‌(Subscribers) బేస్‌ పెంచుకున్నాయి. మేలో ట్రాయ్‌ విడుదల చేసిన గణాంకాల ప్రకారం బీఎస్‌ఎన్‌ఎల్‌ 1.35 లక్షలకుపైగా సబ్‌స్క్రైబర్లను కోల్పోయింది. వోడాఫోన్‌ ఐడియా నుంచి 2.74 లక్షలకుపైగా సబ్‌స్క్రైబర్లు ఇతర నెట్‌వర్క్‌లకు మారారు. ఇదే సమయంలో ఎయిర్‌టెల్‌ 2.5 లక్షలకుపైగా, జియో 27 లక్షల మంది సబ్‌స్క్రైబర్లను పెంచుకున్నాయి. సబ్‌స్క్రైబర్ల బేస్‌ పెరుగుతుండడంతో ప్రధాన టెల్కోలు లాభాలను పెంచుకోవడానికి టారిఫ్‌లపై దృష్టి సారిస్తున్నాయి. ప్రధానంగా ఎయిర్‌టెల్‌, జియోలు టారిఫ్‌లను పెంచడానికి ఆసక్తి చూపుతున్నాయి.

    అయితే ఈసారి బేస్‌ ప్లాన్‌లను పెంచకపోవచ్చని తెలుస్తోంది. కొత్త రీఛార్జ్ ప్లాన్‌(New recharge plan)లలో డేటాలో కోత పెట్టే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇతర దేశాలతో పోల్చితే మన దేశంలోనే టారిఫ్‌లు అతి తక్కువ ధరలో ఉన్నాయని టెలికాం కంపెనీల ప్రతినిధులు పేర్కొంటున్నారు. టెల్కోలు మనుగడ సాగించాలంటే ప్లాన్ల ధరలు పెంచాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో రీఛార్జ్ ప్లాన్లను పెంచుతారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 12 శాతం వరకు టారిఫ్‌లు పెరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.

    READ ALSO  Stock Market | లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

    Read all the Latest News on Aksharatoday and also follow us in ‘X‘ and ‘Facebook

    Latest articles

    Stock Market | మూడో రోజూ స్తబ్ధుగానే.. స్టాక్‌ మార్కెట్‌లో అదే ఊగిసలాట

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​:Stock Market | యూఎస్‌ సుంకాల అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంతో ఇన్వెస్టర్లు బై ఆన్‌...

    Bharat Bandh | రేపు కార్మిక సంఘాల భార‌త్‌బంద్‌.. స‌మ్మెలో పాల్గొన‌నున్న 25 కోట్ల మంది కార్మికులు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ :Bharat Bandh | కేంద్ర ప్ర‌భుత్వ కార్మిక, రైతు విధానాల‌కు వ్య‌తిరేకంగా కార్మిక సంఘాలు బుధ‌వారం...

    Minister Seethakka | కేటీఆర్‌కు ఎందుకింత అహంకారం? ఆదివాసి బిడ్డ‌ను టార్గెట్ చేస్తారా? అని సీత‌క్క ధ్వ‌జం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​:Minister Seethakka | బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(BRS Working President KTR)పై మంత్రి సీత‌క్క...

    YS Rajasekhar Reddy | వైఎస్​ రాజశేఖర్ రెడ్డి సేవలు ఎన్నటికీ మరువలేనివి

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: YS Rajasekhar Reddy | మాజీ సీఎం దివంగత వైఎస్​ రాజశేఖర్​ రెడ్డి ఉమ్మడి...

    More like this

    Stock Market | మూడో రోజూ స్తబ్ధుగానే.. స్టాక్‌ మార్కెట్‌లో అదే ఊగిసలాట

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​:Stock Market | యూఎస్‌ సుంకాల అనిశ్చితి కొనసాగుతోంది. ఈ నేపథ్యంతో ఇన్వెస్టర్లు బై ఆన్‌...

    Bharat Bandh | రేపు కార్మిక సంఘాల భార‌త్‌బంద్‌.. స‌మ్మెలో పాల్గొన‌నున్న 25 కోట్ల మంది కార్మికులు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్​ :Bharat Bandh | కేంద్ర ప్ర‌భుత్వ కార్మిక, రైతు విధానాల‌కు వ్య‌తిరేకంగా కార్మిక సంఘాలు బుధ‌వారం...

    Minister Seethakka | కేటీఆర్‌కు ఎందుకింత అహంకారం? ఆదివాసి బిడ్డ‌ను టార్గెట్ చేస్తారా? అని సీత‌క్క ధ్వ‌జం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ ​:Minister Seethakka | బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(BRS Working President KTR)పై మంత్రి సీత‌క్క...