అక్షరటుడే, వెబ్‌డెస్క్: Passport | పాస్ పోర్టు జారీ చేయడంతో దేశంలోనే తెలంగాణ(Telangana) అగ్రస్థానంలో నిలిచింది. పాస్‌పోర్టు దరఖాస్తుల తనిఖీ, ధ్రువీకరణలో తెలంగాణ పోలీసు విభాగం దేశంలోనే తొలిస్థానంలో ఉంది. మూడు రోజుల్లోనే పాస్‌పోర్ట్(Passport) దరఖాస్తులను పరిశీలించినట్లు విదేశీ వ్యవహారాల శాఖ గుర్తించింది. ఈ మేరకు మంగళవారం పాస్‌పోర్ట్ సేవా దివస్(Passport Service Day) సందర్భంగా దిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ డీజీ శివధర్‌రెడ్డి(Intelligence DG Shivdhar Reddy) ఉత్తమ సేవా ధ్రువీకరణ పత్రం అందుకున్నారు.
Passport | వెరీ ఫాస్ట్ యాప్‌తో..
ప్రజలు పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకున్న తర్వాత పోలీసు శాఖ తనిఖీలు(Police department inspections), ధ్రువీకరణలు చేస్తుంది. ఈ ప్రక్రియ పారదర్శకంగా, వేగంగా జరిగేందుకు పోలీసుశాఖ వెరీ ఫాస్ట్ యాప్ రూపొందించింది. ఈ యాప్‌తో పాస్‌పోర్టుల జారీ ప్రక్రియ సులభతరం, వేగవంతం అయింది. ఈ యాప్ ద్వారా రోజూ 2 వేలకుపైగా ఏడాదిలో 8 లక్షలకు పైగా అర్జీలను పూర్తి చేస్తున్నారు. ఈ ప్రక్రియపై యాప్ ఫీడ్ బ్యాక్(App feedback)లో 95 శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు.