ePaper
More
    HomeజాతీయంArunachalam | అరుణాచల గిరి ప్రదక్షిణలో తెలంగాణ వ్యక్తి హత్య

    Arunachalam | అరుణాచల గిరి ప్రదక్షిణలో తెలంగాణ వ్యక్తి హత్య

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Arunachalam | తమిళనాడు(Tamilnadu)లోని అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తే మంచి జరుగుతుందని భక్తుల విశ్వాసం. దీంతో నిత్యం వేలాది మంది భక్తులు అరుణాచల క్షేత్రానికి వెళ్తుంటారు. ముఖ్యంగా పౌర్ణమి రోజు భక్తులు(Huge Devotees) భారీగా తరలి వచ్చి గిరి ప్రదక్షిణ చేస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధిక సంఖ్యలో భక్తులు ఈ క్షేత్రానికి వెళ్తుంటారు. ఈ క్రమంలో గిరి ప్రదక్షిణ(Giri Pradakshina)కు వెళ్లిన తెలంగాణ వ్యక్తిని ఇద్దరు తమిళ వ్యక్తులు హత్య చేశారు.

    Arunachalam | డబ్బులు ఇవ్వకపోవడంతో..

    యాదాద్రి జిల్లా సౌందరాపురం గ్రామానికి చెందిన విద్యాసాగర్(32) గిరి ప్రదక్షిణ నిమిత్తం అరుణాచలం వెళ్లారు. ఆయన గిరి ప్రదక్షిణలో ఉన్నప్పుడు డబ్బులు ఇవ్వాలని కుగణేశ్వరన్(22), తమిళరసన్(25) అనే ఇద్దరు తమిళ వ్యక్తులు(Tamil People) డిమాండ్​ చేశారు. అందుకు విద్యాసాగర్ నిరాకరించడంతో కత్తితో దాడి చేసి, గొంతు కోశారు. అనంతరం ఆయన దగ్గర ఉన్న రూ.5 వేలు దోచుకొని పారిపోయారు. తీవ్రంగా గాయపడిన విద్యాసాగర్‌ను భక్తులు ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందాడు. నిందుతులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

    READ ALSO  Eagle Team | గంజాయ్​ బ్యాచ్​కు చుక్కలు చూపిస్తున్న ఈగల్​ టీమ్​

    Arunachalam | తెలుగు భక్తులపై వివక్ష!

    అరుణాచల క్షేత్రానికి తెలుగు భక్తులు ఎక్కువ సంఖ్యలో వెళ్తుంటారు. అక్కడి వెళ్లే వారిలో అధికశాతం తెలంగాణ(Telangana), ఏపీకి చెందిన వారే ఉంటారు. తెలుగు ప్రజల మూలంగానే గిరిప్రదక్షిణకు భక్తులు పెరిగారనే భావన కూడా ఉంది. అక్కడ కొంత మంది తెలుగు భక్తులపై వివక్ష చూపుతున్నారని విమర్శలు ఉన్నాయి. ఈ మేరకు పలువురు భక్తులు గతంలో ఆరోపణలు చేశారు.

    Latest articles

    Minister Sridharbabu | ఒక్క చుక్క నీటినీ వ‌దులుకోం.. మంత్రి శ్రీ‌ధ‌ర్‌బాబు స్ప‌ష్టీక‌ర‌ణ‌

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Minister Sridharbabu | ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం(Andhra Pradesh Government) నిర్మించ‌త‌ల‌పెట్టిన బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వ...

    Inflation Rate | రాష్ట్రంలో తగ్గిన ద్రవ్యోల్బణం.. డేంజర్​ అంటున్న నిపుణులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Inflation Rate | రాష్ట్రంలో ద్రవ్యోల్బణం తగ్గింది. జూన్​ నెలకు సంబంధించి –0.93శాతం ద్రవ్యోల్బణం నమోదు...

    Parliament Sessions | జూలై 21 నుంచి పార్ల‌మెంట్ స‌మావేశాలు..లోక్‌స‌భ ముందుకు కీల‌క బిల్లులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Parliament Sessions | పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు(Parliament Monsoon Sessions) జూలై 21 నుంచి ప్రారంభం కానున్నాయి....

    Encounter | మావోయిస్టులకు షాక్​.. మరో కీలక నేత హతం

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Encounter | మావోయిస్టులకు మరో షాక్​ తగిలింది. ఆపరేషన్​ కగార్(Operation Kagar)​లో భాగంగా చోటు చేసుకుంటున్న...

    More like this