అక్షరటుడే, హైదరాబాద్: Judas strike : తమ డిమాండ్ల సాధనకు తెలంగాణ(Telangana)లో జూనియర్ డాక్టర్లు (junior doctors) సమ్మె బాట పట్టబోతున్నారు. ఈ నెల 30 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్లు తెలంగాణ జూనియర్ డాక్టర్లు ప్రకటించారు. జనవరి నెల నుంచి తమకు ఇవ్వాల్సిన స్టైఫండ్ చెల్లించాలని, నియామక ప్రక్రియ వేగవంతం చేయాలని, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని తెలంగాణ జూనియర్ డాక్టర్ అసోసియేషన్ (TJUDA)Telangana Junior Doctors’ Association (TJUDA) డిమాండ్ చేస్తోంది.
Judas strike : డిమాండ్ల సాధనకై..
జూడాల డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే ఈనెల 30 నుంచి నిరవధిక సమ్మె చేస్తామని, అత్యవసర సేవలు మినహాయించి అన్ని సేవలను బహిష్కరిస్తామని TJUDA హెచ్చరించింది. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ జూడాల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఇసాక్ న్యూటన్ తెలిపారు. స్టైఫండ్ చెల్లింపులో జాప్యం, మౌలిక సదుపాయాలపై నిరసన వ్యక్తం చేశారు.
మెడికల్ కళాశాలల్లో(medical colleges) బోధనా సిబ్బంది కొరతపై ఇసాక్ అసంతృప్తి వ్యక్తం చేశారు. స్కాలర్‌షిప్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఫీజు రీయింబర్స్‌మెంట్(fee reimbursement) చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆందోళన తెలిపారు. తమ డిమాండ్లపై తెలంగాణ సర్కారుకు చాలాసార్లు వినతి పత్రం ఇచ్చినా ఫలితం లేకుండాపోయిందన్నారు. అందుకే సమ్మెకు వెళ్తున్నట్లు చెప్పుకొచ్చారు.