అక్షరటుడే, హైదరాబాద్: Telangana EAPCET : తెలంగాణలో నేటి నుంచి EAPCET పరీక్షలు ప్రారంభం అయ్యాయి. రోజూ రెండు సెషన్లలో ఎప్‌సెట్ పరీక్షలు ఉండనున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెషన్ పరీక్షలు ఉంటాయి. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ లో పరీక్షలు జరగనున్నాయి. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు నో ఎంట్రీ నిబంధన కొనసాగుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా 124 కేంద్రాల్లో పరీక్షలు జరుగుతున్నాయి. 2,19,420 మంది విద్యార్థులు ఇంజినీరింగ్ ప్రవేశపరీక్షకు హాజరుకానున్నారు. అగ్రికల్చర్, ఫార్మా పరీక్షలను 86,101 మంది విద్యార్థులు రాయనున్నారు.