ePaper
More
    HomeతెలంగాణTeenmar Mallanna | తీన్మార్​ మల్లన్నపై దాడి.. ఆ వ్యాఖ్యలే కారణమా.. అసలు మల్లన్న ఏమన్నారంటే..

    Teenmar Mallanna | తీన్మార్​ మల్లన్నపై దాడి.. ఆ వ్యాఖ్యలే కారణమా.. అసలు మల్లన్న ఏమన్నారంటే..

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Teenmar Mallanna | ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న ఆఫీస్​పై (Attack On Mallanna Office) జాగృతి నాయకులు దాడి చేసిన విషయం తెలిసిందే. క్యూ న్యూస్​ కార్యాలయంలో ఆయనపై దాడికి పాల్పడటంతో మల్లన్న చేతికి స్వల్పంగా గాయమైంది. అంతేగాకుండా గన్​మన్​పై కూడా జాగృతి కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. అయితే ఎమ్మెల్సీ కవితపై ఇటీవల మల్లన్న చేసిన వ్యాఖ్యలతోనే జాగృతి నాయకులు దాడి చేసినట్లు తెలుస్తోంది.

    Teenmar Mallanna | మీడియా సంస్థలపై వరుస దాడులు

    తెలంగాణలో మీడియా సంస్థల(Media Houses)పై దాడులు జరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ఫోన్​ ట్యాపింగ్​ (Phone Tapping) వ్యవహారంలో కేటీఆర్​కు వ్యతిరేకంగా వార్తలు ప్రచురిస్తున్నారని బీఆర్​ఎస్​ కార్యకర్తలు ఇటీవల మహాన్యూస్​ (Maha News)పై దాడి చేశారు. అంతేగాకుండా ఏబీఎన్​ ఆంధ్రజ్యోతిపై కూడా దాడులకు పాల్పడుతామని హెచ్చరించారు. తాజాగా జాగృతి కార్యకర్తలు (Jagruthi Workers) ఎమ్మెల్సీ తీన్మార్​ మల్లన్న (Teenmar Mallanna) క్యూ న్యూస్ (Q News)​ ఆఫీస్​పై దాడి చేయడం గమనార్హం.

    READ ALSO  Godavari River | గోదావరికి వరద ఉధృతి

    Teenmar Mallanna | బీసీ రిజర్వేషన్లపై వ్యాఖ్యలతో..

    కాంగ్రెస్​ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో (Local Body Elections) బీసీలకు 42శాతం రిజర్వేషన్లు ఇస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఆర్డినెన్స్​ తీసుకు వస్తామని మంత్రివర్గంలో తీర్మానం చేసింది. అయితే ఇది తమ విజయమని ఎమ్మెల్సీ కవిత ఇటీవల సంబరాలు చేసుకున్నారు. కవిత సంబరాలపై ఎమ్మెల్సీ మల్లన్న వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమెకు, బీసీలకు ఏం సంబంధం అని ప్రశ్నించారు. బీసీలకు రిజర్వేషన్లు ఇస్తే ఆమె ఎందుకు రంగు పూసుకుంటుందన్నారు. అంతేగాకుండా ఆమెకు బీసీలతో కంచంలో పొత్తు ఉందా అనడంతో పాటు.. మరో అసభ్యకరమైన వ్యాఖ్య చేశారు. దీంతో జాగృతి కార్యకర్తలు ఆయన కార్యాలయంపై దాడికి పాల్పడ్డారు.

    Teenmar Mallanna | గన్​ లాక్కునే ప్రయత్నం: మల్లన్న

    దాడి అనంతరం తీన్మార్​ మల్లన్న మీడియాతో మాట్లాడారు. 20 నుంచి 30 మంది జాగృతి నాయకులు తనపై దాడి చేయడానికి వచ్చారన్నారు. సిబ్బందితో పాటు కార్యాలయంలో ఉన్న ప్రజలపై సైతం దాడి చేశారని చెప్పారు. కల్వకుంట్ల సుజిత్ రావు (Kalvakuntla Sujith Rao) అనే వ్యక్తి తన గన్​మన్​ వద్ద గన్​ లాక్కొని తనపై కాల్పులు జరపాలని చూశాడన్నారు. ఆఫీస్​లో విధ్వంసం సృష్టించడంతో మరో గన్​మన్​ గాల్లోకి కాల్పులు జరిపాడన్నారు. దీంతో వారు భయపడి పారిపోయారని చెప్పారు.

    READ ALSO  MLC Kavitha | ఆ గ్రామాలను తెలంగాణలో కలపండి.. ఏపీ సీఎంకు ఎమ్మెల్సీ కవిత లేఖ

    Teenmar Mallanna | కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదు

    తీన్మార్​ మల్లన్న గన్​మన్​ జరిపిన కాల్పుల్లో ఎవరికి గాయాలు కాలేదని రాచకొండ సీపీ సుధీర్​బాబు (Rachakonda CP Sudheer Babu) తెలిపారు. ఇరువర్గాల తోపులాటలో ఆఫీస్​ అద్దాలు ధ్వంసం అయ్యాయన్నారు. అవి గుచ్చుకోవడంతో కొందరికి గాయాలు అయ్యాయని వెల్లడించారు. ఈ దాడిలో మల్లన్న చేతికి గాయం అయిందన్నారు. జాగృతి కార్యకర్తలను అదుపు చేయడానికి గన్​మన్​ గాల్లోకి కాల్పులు జరిపారన్నారు. దాడికి పాల్పడిన జాగృతి కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. మరోవైపు మల్కాజ్​గిరి డీసీపీ పద్మజ రెడ్డి మల్లన్న కార్యాలయాన్ని పరిశీలించారు. క్లూస్​ టీంతో​ ఆధారాలు సేకరించారు. కాల్పులు జరపడానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు.

    Latest articles

    Parliament Sessions | జూలై 21 నుంచి పార్ల‌మెంట్ స‌మావేశాలు..లోక్‌స‌భ ముందుకు కీల‌క బిల్లులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Parliament Sessions | పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు(Parliament Monsoon Sessions) జూలై 21 నుంచి ప్రారంభం కానున్నాయి....

    Encounter | మావోయిస్టులకు షాక్​.. మరో కీలక నేత హతం

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Encounter | మావోయిస్టులకు మరో షాక్​ తగిలింది. ఆపరేషన్​ కగార్(Operation Kagar)​లో భాగంగా చోటు చేసుకుంటున్న...

    Rohith – Kohli | రోహిత్‌, కోహ్లీ వ‌న్డే కెరీర్‌కి సంబంధించి బీసీసీఐ కీల‌క ప్ర‌క‌ట‌న‌.. అప్ప‌టి వ‌ర‌కు ఆడతారు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rohith - Kohli | టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ (Rohith Sharma), విరాట్...

    Udaipur Files Movie | ఉద‌య్‌పూర్ ఫైల్స్ చిత్రానికి తొల‌గని అడ్డంకులు.. కేంద్ర నిర్ణ‌యం కోసం వేచి ఉండాల‌న్న సుప్రీంకోర్టు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Udaipur Files Movie | టైల‌ర్ క‌న్న‌య్య లాల్(Tailor Kannaya Lal) హ‌త్యోదంతం ఆధారంగా నిర్మించిన...

    More like this

    Parliament Sessions | జూలై 21 నుంచి పార్ల‌మెంట్ స‌మావేశాలు..లోక్‌స‌భ ముందుకు కీల‌క బిల్లులు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Parliament Sessions | పార్ల‌మెంట్ వ‌ర్షాకాల స‌మావేశాలు(Parliament Monsoon Sessions) జూలై 21 నుంచి ప్రారంభం కానున్నాయి....

    Encounter | మావోయిస్టులకు షాక్​.. మరో కీలక నేత హతం

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Encounter | మావోయిస్టులకు మరో షాక్​ తగిలింది. ఆపరేషన్​ కగార్(Operation Kagar)​లో భాగంగా చోటు చేసుకుంటున్న...

    Rohith – Kohli | రోహిత్‌, కోహ్లీ వ‌న్డే కెరీర్‌కి సంబంధించి బీసీసీఐ కీల‌క ప్ర‌క‌ట‌న‌.. అప్ప‌టి వ‌ర‌కు ఆడతారు..

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Rohith - Kohli | టీమిండియా స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ (Rohith Sharma), విరాట్...