అక్షరటుడే, ఇందూరు: Canon camera | కెమెరా టెక్నాలజీని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుని మెరుగైన ఫొటోగ్రఫీని ప్రజలకు అందించాలని కెనాన్ ఇన్‌ప్లూయెన్సర్ (Canaan Influencer) సిద్ధు సోమ పేర్కొన్నారు. మెంట్రాజ్‌పల్లిలోని (Mentrajpally) విరూపాక్ష స్టూడియోలో (Virupaksha Studio) నిర్వహించిన కెనాన్ వర్క్‌షాప్‌లో ఆయన ప్రసంగించారు.
ఫొటో, వీడియోగ్రాఫర్లు ఎప్పటికప్పుడు అప్‌గ్రేడ్ అయితేనే మార్కెట్లో నిలదొక్కుదోగలుతారని వివరించారు. ఈ సందర్భంగా కెమెరా మెనూ సెట్టింగ్స్, న్యూ టెక్నాలజీ గురించి స్పష్టంగా వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమంలో మోహన్, శ్రీనివాస్, సారిక సైబ సురేష్, బాస శ్రీనివాస్, శివజ్యోతి ఎలక్ర్టానిక్స్ సతీష్, జిల్లాల నుంచి ఫొటోగ్రాఫర్స్ హాజరయ్యారు.