అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tatkal Ticket Booking | భారతీయ రైల్వే (Indian Railways) తత్కాల్ టిక్కెట్ల బుకింగ్ విధానంలో భారీ మార్పులు చేపట్టింది. జులై 15, 2025 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఇకపై తత్కాల్ టికెట్లను IRCTC వెబ్‌సైట్ లేదా యాప్‌లో బుక్ చేయాలంటే, ఆధార్ ఆధారిత OTP ధ్రువీకరణ తప్పనిసరి అవుతుంది. బ్రోకర్లు, నకిలీ ఏజెంట్లు స్పెషల్ సాఫ్ట్‌వేర్‌ల ద్వారా తత్కాల్ టికెట్లను క్షణాల్లో బుక్ చేసి, సాధారణ ప్రయాణికులకు అవి అందకుండా చేస్తున్నందున, ఈ మార్పులు తీసుకొచ్చారు. కొత్త విధానం ద్వారా పారదర్శకత పెరుగుతుందని, మోసాలకు అడ్డుకట్ట పడుతుందని రైల్వే శాఖ భావిస్తోంది.
Tatkal Ticket Booking | ఆధార్ ధ్రువీకరణ ఎలా?
మీరు (IRCTC) ఖాతాలోకి లాగిన్ అయ్యాక, ఆధార్ నంబర్‌ను లింక్ చేయాలి. టికెట్ బుకింగ్ సమయంలో, ఆధార్‌తో లింకైన మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. OTP నమోదు చేసిన తర్వాతే బుకింగ్ పూర్తవుతుంది. స్టేషన్ కౌంటర్ల(Station Counters)లో కూడా అదే విధానాన్ని అనుసరిస్తారు. అయితే తత్కాల్ టికెట్ బుకింగ్ (Tatkal Ticket Booking) కోసం ఆధార్ తప్పనిసరిగా ఉండాలా? అంటే అవును అనే అంటున్నారు. కొత్త నిబంధనల ప్రకారం, ఆధార్ కార్డు లేకుండా తత్కాల్ టికెట్ బుక్ చేయడం అసాధ్యం. ఆధార్ లింక్ లేకుంటే OTP రాకపోవచ్చు, దాంతో బుకింగ్ ఫెయిలవుతుంది.
తత్కాల్ టికెట్ల బుకింగ్ ప్రారంభం విషయానికి వస్తే.. AC క్లాస్‌కు ఉదయం 10 గంటలకు, నాన్-AC క్లాస్‌కు 11 గంటలకు బుకింగ్ మొదలవుతుంది. ఈ సమయాల్లో ఏజెంట్లు పెద్ద ఎత్తున టికెట్లు బుక్ చేయడాన్ని అడ్డుకునేందుకు, మొదటి 30 నిమిషాలు ఏజెంట్లకు బుకింగ్ చేయడాన్ని నిషేధించారు. దాంతో సాధారణ ప్రయాణికులకు టికెట్లు దొరికే అవకాశాలు పెరుగుతాయి.
ఇక స్టేషన్ కౌంటర్ బుకింగ్‌లో మార్పులేంటనేది గమనిస్తే.. తత్కాల్ టికెట్ బుక్ చేసుకునే వారు కౌంటర్‌లో ఆధార్ నంబర్(Aadhar Number) ఇవ్వాలి. అదే ఆధార్‌కు లింకైన మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPను నమోదు చేయాలి. ఇతరులకోసం బుకింగ్ చేస్తే, ఆ ప్రయాణికుడి ఆధార్, OTP కూడా అవసరం. ఈ నియమాలు తత్కాల్‌కు మాత్రమే, ఆధార్ ధ్రువీకరణ కేవలం తత్కాల్ టిక్కెట్లకే వర్తిస్తుంది. సాధారణ లేదా వెయిటింగ్ టిక్కెట్లకు ఈ నిబంధన అవసరం లేదు. IRCTC ఖాతాతో ఆధార్ ఎలా లింక్ చేయాలి అంటే ముందుగా IRCTC వెబ్‌సైట్ / యాప్‌లో లాగిన్ కావాలి. “My Profile” లోకి వెళ్లి ఆధార్ వివరాలు అప్‌డేట్ చేయాలి, మొబైల్ నంబర్ ఆధార్‌తో తప్పనిసరి లింక్ అయి ఉండాలి.