అక్షరటుడే, బోధన్: Task Force Police | ఉమ్మడి జిల్లాలో పేకాటస్థావరాలపై పోలీసులు నిఘా పెట్టారు. పక్కా సమాచారంతో వరుస దాడులు చేస్తున్నారు. పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరుస్తున్నారు. సాలూర (Salura) మండల శివారులోని పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో దాడిచేశారు. రూ. 30,000 స్వాధీనం చేసుకుని ఆరుగురిని అదుపులోకి తీసుకున్నట్లు రూరల్ సీఐ విజయ్‌బాబు (CI Vijay Babu) పేర్కొన్నారు.
Task Force Police | శ్మశానవాటికలో పేకాడుతుండగా..
అక్షరటుడే, బాన్సువాడ: బీర్కూరు(Birkur) మండలం అన్నారం(annaram) గ్రామంలో పేకాట స్థావరంపై దాడి చేసినట్లు ఎస్సై రాజశేఖర్ (SI rajashekar) తెలిపారు. పక్కా సమాచారం మేరకు శ్మశాన వాటికలో పేకాట ఆడుతున్న ఏడుగురిని పట్టుకున్నామని వివరించారు. వారి వద్ద నుంచి రూ.3,400 నగదు, మూడు బైక్‌లు, 4 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు ఎస్సై తెలిపారు.