ePaper
More
    HomeజాతీయంTamil Nadu | తమిళనాడులో విషాదం.. స్కూల్​ బస్సును ఢీకొన్న రైలు

    Tamil Nadu | తమిళనాడులో విషాదం.. స్కూల్​ బస్సును ఢీకొన్న రైలు

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Tamil Nadu | తమిళనాడులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ స్కూల్​ బస్సు(School Bus)ను రైలు ఢీకొంది. తమిళనాడులోని కడలూరు(Cuddalore)లో ఓ స్కూల్​ బస్సు పట్టాలు దాటుతుండగా వేగంగా వచ్చిన రైలు ఢీకొంది. దీంతో బస్సు పట్టాలపై ఎగిరి పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే మృతి చెందగా.. 15 మంది విద్యార్థులు(Students) గాయపడ్డారు.

    స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అయితే పలువురు విద్యార్థుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. చెమ్మంగుప్పంలో రైల్వే గేటు(Chemmanguppam Railway Gate) దాటుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే రైలు వచ్చే సమయంలో గేటు వేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రైల్వే అధికారులు(Railway Officers) సైతం ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు.

    READ ALSO  Marriage | బ్రహ్మచారుల దేవుడు.. దర్శనం చేసుకుంటే మ్యారేజ్​ పక్కా..!

    గతంలో తెలంగాణలోని మెదక్​ జిల్లా మాసాయిపేటలో సైతం ఓ స్కూల్​ బస్సును రైలు ఢీకొన్న విషయం తెలిసిందే. 40 మంది విద్యార్థులతో వెళ్తున్న బస్సును లెవల్ క్రాసింగ్ వద్ద నాందేడ్-హైదరాబాద్ ప్యాసింజర్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పదహారు మంది విద్యార్థులు, డ్రైవర్ క్లీనర్ మరణించారు. అక్కడ రైల్వే గేటు లేకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటన తర్వాత రైల్వే శాఖ దేశవ్యాప్తంగా క్రాసింగ్​ల వద్ద రైల్వే గేట్లను ఏర్పాటు చేసింది. అయినా తాజాగా చెన్నైలో ప్రమాదం చోటు చేసుకోవడం గమనార్హం.

    Read all the Latest News on Aksharatoday.in

    Latest articles

    Padmashali Sangham | పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా మహేష్

    అక్షరటుడే, ఇందూరు: Padmashali Sangham | పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా బిల్లా మహేష్ నియామకమయ్యారు. ఈ మేరకు...

    Telangana University | భూచట్టాలపై తెయూ విద్యార్థులకు అవగాహన

    అక్షరటుడే, ఇందల్వాయి: Telangana University | భూ సంబంధిత చట్టాలు, పన్నులపై తెలంగాణ యూనివర్సిటీలో (Telangana University) న్యాయ...

    ACB Trap | ఏసీబీకి చిక్కిన ట్యాక్స్​ ఆఫీసర్​

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Trap | అవినీతి అధికారుల్లో మార్పు రావడం లేదు. పైసలు తీసుకోనిదే...

    Deputy CM Bhatti | నీళ్లపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమా..? బీఆర్ఎస్‌కు డిప్యూటీ సీఎం భట్టి సవాల్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Deputy CM Bhatti | కృష్ణ, గోదావరి నీళ్లపై శాసనసభలో చర్చించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా...

    More like this