అక్షరటుడే, వెబ్‌డెస్క్: Governor Jishnu Dev Varma | ప్రతి జిల్లాలో రక్తనిధి కేంద్రాలు ఏర్పాటు చేసి అత్యవసరమైన సమయంలో రక్తం అందించే విధంగా చూడాలని రాష్ట్ర గవర్నర్, రాష్ట్ర రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షుడు శ్రీ విష్ణుదేవ్ వర్మ(Governor Jishnu Dev Varma) పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు రెడ్‌క్రాస్ జిల్లా ఛైర్మన్లు, రాష్ట్ర పాలకమండలి సభ్యులు తదితరులు హైదరాబాద్ (Hyderabad)లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
Governor Jishnu Dev Varma | టీబీ ముక్త్ భారత్ అభియాన్‌లో..
తెలంగాణ రాష్ట్రాన్ని టీబీ రహిత రాష్ట్రంగా మార్చేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని గవర్నర్ పేర్కొన్నారు. టీబీ ముక్త్ భారత్ అభియాన్(TB Mukt Bharat Abhiyan)లో భాగంగా దేశవ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు.
Governor Jishnu Dev Varma | విద్యాసంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో..
రాష్ట్రంలో విద్యాసంవత్సరం ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులు యూత్ రెడ్‌క్రాస్, జూనియర్ రెడ్‌క్రాస్‌లో సభ్యత్వం పొందేలా ప్రోత్సహించాలన్నారు. సీపీఆర్ వంటి అత్యవసర శిక్షణలు అందించాలని సూచించారు. రెడ్‌క్రాస్ మెంబర్‌షిప్ డ్రైవ్ (Red Cross Membership Drive) నిర్వహించి జీవితకాల సభ్యులను చేర్చుకుని, పక్క రాష్ట్రాలతో పోటీ పడే స్థాయికి తీసుకెళ్లాలని చెప్పారు.
Governor Jishnu Dev Varma | డిజాస్టర్ సెల్ ఏర్పాటు చేయాలి
ప్రకృతి వైపరీత్యాలు, విపత్తులు సంభవించినప్పుడు డిజాస్టర్ సెల్(Disaster Cell) ఏర్పాటు చేసి వలంటీర్ల ద్వారా సహాయ కార్యకలాపాలు నిర్వర్తించాల్సిన అవసరాన్ని గవర్నర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఇప్పటివరకు రాష్ట్ర రెడ్ క్రాస్ సమాజానికి విశేష సేవలు అందించిందని, ఇకముందు కూడా ఇదే పద్ధతిలో మన రాష్ట్రం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచేలా తన వంతుగా అన్ని విధాలుగా సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. సమావేశం అనంతరం గవర్నర్‌ను రెడ్‌క్రాస్ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు.
కార్యక్రమంలో నిజామాబాద్ నుంచి రాష్ట్ర పాలక మండలి సభ్యుడు తోట రాజశేఖర్, హన్మకొండ జిల్లా ఛైర్మన్ డా. పి. విజయచందర్ రెడ్డి, రాష్ట్ర పాలకమండలి సభ్యులు ఈవీ. శ్రీనివాస్ రావు, మేడ్చల్ మల్కాజిగిరి ఛైర్మన్ రాజేశ్వరరావు, రంగారెడ్డి ఛైర్మన్ నరసింహారెడ్డి, సంగారెడ్డి ఛైర్మన్ వనజా రెడ్డి, నాగర్‌కర్నూలు రాష్ట్ర పాలకమండలి సభ్యులు రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలోని రెడ్‌క్రాస్ ప్రతినిధులతో మాట్లాడుతున్న గవర్నర్ జిష్టుదేవ్ వర్మ