అక్షరటుడే, వెబ్‌డెస్క్: Swachh Sarvekshan | కేంద్ర ప్రభుత్వం తాజాగా వివిధ విభాగాల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు (Swachh Sarvekshan Awards) ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోని ఐదు నగరాలకు అవార్డులు వరించాయి. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయవాడ, గుంటూరుకు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులు వచ్చాయి.
జాతీయ స్థాయిలో ప్రత్యేక కేటగిరీ మినిస్టీరియల్ అవార్డును వైజాగ్ దక్కించుకుంది. రాష్ట్రస్థాయిలో అవార్డుకు రాజమహేంద్రవరం నగరాన్ని ఎంపిక చేశారు. స్వచ్ఛ సూపర్‌లీగ్ నగరాల కేటగిరిలో గుంటూరు, విజయవాడ, తిరుపతి ఎంపికయ్యాయి. రాష్ట్రంలోని ఐదు నగరాలకు అవార్డులు రావడంతో ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభిరామ్ స్పందించారు. సీఎం చంద్రబాబు చేపట్టిన కార్యక్రమాలతోనే ఈ అవార్డులు వచ్చాయన్నారు. ఆయా నగరాల స్వచ్ఛత కోసం కృషి చేసిన అధికారులు, పారిశుద్ధ్య సిబ్బంది, ప్రజలకు పట్టాభిరామ్ అభినందనలు తెలిపారు.