అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Supreme Court | విద్వేష ప్రసంగాలపై సర్వోన్నత న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. వాక్ స్వాతంత్య్రం, భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కును దుర్వినియోగం చేస్తున్నారని వ్యాఖ్యానించింది.
ఈ క్రమంలో విద్వేషపూరిత ప్రసంగాల కట్టడికి చర్యలు తీసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను (central and state governments) సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే, అది పౌరుల భావ ప్రకటనా హక్కుకు భంగం వాటిల్లకుండా ఉండాలని సూచించింది. ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi), ఆర్ఎస్ ఎస్ ను కించపరిచేలా కార్టూన్ వేసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంపై నమోదైన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కార్టూనిస్ట్ హేమాంత్ మాల్వియ దాఖలు చేసిన పిటిషన్ పై సోమవారం విచారణ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. కొందరు వాక్ స్వేచ్ఛ, భావ ప్రకటనా స్వేచ్ఛ హక్కును దుర్వినియోగం చేస్తున్నారని వ్యాఖ్యానించింది.
Supreme Court | నియంత్రణ పాటించాలి..
వాక్ స్వేచ్ఛ విలువను పౌరులు తెలుసుకోవాలని, తమ భావ వ్యక్తీకరణలో సంయమనం పాటించాలని న్యాయమూర్తులు సుధాంషు ధులియా, అరవింద్ కుమార్లతో (Justices Sudhanshu Dhulia and Arvind Kumar) కూడిన ధర్మాసనం హితవు పలికింది. ఇతరులను కించపరిచేలా ఇలా చేయడం వెనుక పిటిషనర్ ఉద్దేశం ఏమిటని ప్రశ్నించింది. సోషల్ మీడియాలో (Social Media) చేసిన పోస్టుపై అభ్యంతరం వ్యక్తం చేసిన ధర్మాసనం.. “మీరు ఇదంతా ఎందుకు చేస్తారు?” అని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. విద్వేషపూరిత వైఖరి మంచిది కాదని హితవు పలికింది. ఇలాంటి వాటిని నియంత్రించేందుకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సూచించింది. అయితే, వాక్ స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ హక్కుకు సంబంధించిన మార్గదర్శకాలను రూపొందించడంపై చర్చించేటప్పుడు పౌరులలో సోదరభావం అవసరాన్ని కూడా అత్యున్నత న్యాయస్థానం నొక్కి చెప్పింది. కోర్టు సెన్సార్షిప్ కోసం వాదించడం లేదని, పౌరులు తమ భావ వ్యక్తీకరణలలో స్వీయ నియంత్రణచ బాధ్యతాయుతమైన నియంత్రణను పాటించమని ప్రోత్సహిస్తుందని పేర్కొంది.