అక్షరటుడే, వెబ్డెస్క్: Summer Holidays | విద్యార్థులకు వేసవి సెలవులు summer holidays ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 24 నుంచి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh, తెలంగాణ Telangana లోని పాఠశాలలకు schools ప్రభుత్వాలు సెలవులు ప్రకటించాయి. ఇప్పటికే ఆయా పాఠశాలల్లో వార్షిక పరీక్షలు annual exams ముగియడంతో విద్యార్థులకు ప్రొగ్రెస్ కార్డులు అందజేస్తున్నారు. రేపటితో ప్రొగ్రెస్ కార్డుల అందజేత ప్రక్రియ ముగించి సెలవులు ఇవ్వనున్నారు. రెండు రాష్ట్రాల్లో కూడా జూన్ 12న పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి.
Summer Holidays | జాగ్రత్తలు తప్పనిసరి..
వేసవి సెలవులు అంటే విద్యార్థులు ఎగిరి గంతులు వేస్తారు. పొద్దున ఇంటి నుంచి వెళ్లి సాయంత్రం వరకు స్నేహితులతో ఆడుకుంటునే ఉంటారు. అయితే ప్రస్తుతం ఎండలు మండుతుండటంతో మధ్యాహ్నం పూట పిల్లలను బయటకు పంపొద్దని వైద్యులు doctors సూచిస్తున్నారు. అలాగే నీరు water ఎక్కువగా తాగాలని చెబుతున్నారు.
అంతేగాకుండా పలువురు పిల్లలు వేసవిలో ఉక్కపోత నుంచి ఉపశమనంం కోసం చెరువులు ponds, కాలువల్లో canals ఈత swimming కొట్టడానికి వెళ్తారు. అయితే నీటిలో జాగ్రత్తలు పాటించాలి. ఈత రాకపోతే చెరువులోకి దిగకపోవడం మంచిది. ఈత వచ్చిన కాలువల్లో ప్రవాహం అధికంగా ఉంటే కొట్టుకుపోయే అవకాశం ఉంటుంది. తల్లిదండ్రులు సెలవుల్లో విద్యార్థులు ఓ కంట కనిపెడుతూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.