అక్షరటుడే, ఇందూరు:Summer Camp | విద్యార్థినుల్లో ఆత్మస్థైర్యం పెంచేందుకే వేసవి శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు పోలీస్ కమిషనర్ సాయిచైతన్య(CP Sai Chaitanya) తెలిపారు. ఆర్బీవీఆర్ఆర్ పాఠశాల(RBVRR School)లో వారం రోజుల సమ్మర్ క్యాంప్(Summer Camp)ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. బాలికలు సమాజంలో ఎలా ఉండాలనే విషయాలను క్యాంప్‌లో వివరిస్తారని పేర్కొన్నారు. ప్రధానంగా ఆత్మస్థైర్యాన్ని పెంపొందించుకునేందుకు సెల్ఫ్ మోటివేషన్(Self Motivation) తరగతులు ఉంటాయన్నారు. ఉదయం తైక్వాండో(Taekwondo), సెల్ఫ్ డిఫెన్స్(self defense) శిక్షణ ఉంటుందన్నారు. ఆసక్తిగల బాలికలను శిక్షణ శిబిరంలో చేర్పించాలని, శనివారం వరకు అవకాశముందని చెప్పారు.
అనంతరం మానసిక వైద్య నిపుణులు విశాల్(Psychiatrist Vishal) మాట్లాడుతూ.. సమాజంలో ప్రస్తుతం సెల్‌ఫోన్ మోజు(Cellphone addiction)లో పడి యువత చెడుదారుల్లో వెళ్తోందన్నారు. కార్యక్రమంలో మోటివేషన్ స్పీకర్ శ్రీహరి, ట్రైయినీ ఐపీఎస్ సాయికిరణ్, సౌత్ రూరల్ ఇన్స్పెక్టర్ సురేష్ కుమార్, యోగా మాస్టర్ కిషన్, తైక్వాండో ట్రైనర్ మనోజ్, రూరల్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.