అక్షరటుడే, వెబ్‌డెస్క్: Uttar Pradesh : ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో దారుణం చోటుచేసుకుంది. భార్య, పోలీసుల వేధింపుల కారణంగా ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే విషయాన్ని బాధితుడు తన ప్యాంటుపై సూసైట్ నోట్ రాసుకుని చనిపోయాడు.
Uttar Pradesh : ప్యాంటుపై..
ఫరూఖాబాద్ జిల్లా Farrukhabad district లోని మౌదర్వాజా Maudarwaja పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని గుటాసి గ్రామం(Gutasi village) లో రామ్ రయీస్ కుమారుడు దిలీప్ కుమార్(25) ఉంటున్నాడు. సోమవారం రాత్రి దిలీప్ ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య, పోలీసుల వేధింపుల వల్లే తాను చనిపోతున్నట్లు ప్యాంటుపై రాసుకున్నాడు.
మంగళవారం (జులై 15) ఉదయం దిలీప్ కుమార్ విగతజీవిగా పడి ఉండడాన్ని కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందజేశారు. అదనపు పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ సంజయ్ సింగ్ ఘటనాస్థలికి చేరుకున్నారు. ఘటనపై దర్యాప్తు చేపట్టారు.
Uttar Pradesh : సూసైట్ నోట్‌లో ఏముంది..?
దిలీప్ కుమార్ తన ప్యాంటుపై సూసైడ్ నోట్ రాసుకున్నాడు. ఏమని రాశాడంటే.. తన భార్య ఫిర్యాదుతో పోలీసులు మహేశ్ ఉపాధ్యాయ్, యశ్వంత్ యాదవ్ తనపై దాడి చేశారని రాశాడు. రూ.50 వేలు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారని పేర్కొన్నాడు. తన భార్యతో కాంప్రమైస్ కావాలని బలవంతం చేశారన్నాడు.
దిలీప్ కుమార్ రాసిన సూసైట్ నోట్ రాసిన ప్యాంట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు కానిస్టేబుళ్లతోపాటు మరో ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుల్లో దిలీప్ మామ బన్వారీ లాల్, బావమరుదులు రజనేశ్ రాజ్ పుత్, రాజుతోపాటు హథియాపుర్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుళ్లు మహేశ్ ఉపాధ్యాయ్, యశ్వంత్ యాదవ్ ఉన్నారు.
Uttar Pradesh : ఏఎస్పీ ఏమన్నారంటే..
దిలీప్, అతడి భార్యకు గొడవలున్నాయని ఏఎస్పీ డాక్టర్ సంజయ్ సింగ్ తెలిపారు. అతడి భార్య మౌదర్వాజా ఠాణాలో ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. మౌదర్వాజా పుట్టింటివారు పోలీస్ స్టేషన్‌కు వచ్చారని చెప్పారు. అక్కడ దిలీప్, మౌదర్వాజా రాజీకి వచ్చేలా పోలీసులు చేశారన్నారు.
ఆ తర్వాత దిలీప్ తన ఇంటికి వెళ్లి సూసైడ్ చేసుకున్నట్లు ఏఎస్పీ చెప్పుకొచ్చారు. సూసైడ్ నోట్‌లో తన భార్య తండ్రి, సోదరుడు, బావమరిది పేర్లు రాసినట్లు తెలిపారు. పోలీసు కానిస్టేబుళ్ల గురించి కూడా చెప్పారు. ఈ మేరకు ఆ ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు.