అక్షరటుడే, వెబ్‌డెస్క్: Shubanshu Shukla | ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా భూమిపైకి చేరుకున్నారు. అంతరిక్ష కేంద్రంలో 18 రోజులు గడిపిన శుక్లా నేడు మధ్యాహ్నం దిగారు. కాలిఫోర్నియా (California) సమీపంలోని సముద్రంలో క్యాప్సుల్ ల్యాండింగ్ అయ్యింది. శుభాంశు శుక్లాతో సహా నలుగురు ఆస్ట్రోనాట్స్ బృందం (four astronauts teams) సముద్రంలో ల్యాండ్ అయ్యింది. దీంతో వెంటనే క్యాప్సుల్‌ను యూఎస్ నేవీ స్వాధీనం చేసుకుంది. బయటకు వచ్చిన వారు ఏడు రోజుల పాటు క్వారంటైన్లో ఉండనున్నారు. ఆ తర్వాత నాసా కేంద్రానికి తరలించనున్నారు. స్పేస్ స్టేషన్లో ఈ బృందం మొత్తం 60 రకాల ప్రయోగాలు చేసింది.
Shubanshu Shukla | జూన్ 25న నింగిలోకి..
భారత వ్యోమగామి శుభాంశు శుక్లా 18 రోజుల అంతరిక్ష యాత్ర(Space Travel) అనంతరం భూమిపైకి చేరుకున్నారు. జూన్ 25న ఇస్రో, నాసా సంయుక్తంగా చేపట్టిన ఆక్సియం-4 మిషన్‌లో భాగంగా భారత వైమానిక దళానికి చెందిన శుభాంశు శుక్లా(Shubhanshu Shukla) అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి (ISS) వెళ్లిన విషయం తెలిసిందే.
Shubanshu Shukla | 18 రోజులు ప్రయోగాలు
గత నెల 25న ఫాల్కన్–9 రాకెట్ ద్వారా శుభాంశు శుక్లాతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు అంతరిక్షంలోకి వెళ్లారు. వారు 28 గంటలు ప్రయాణించిన తర్వాత 26న అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. అక్కడ శుభాంశు శుక్లా 18 రోజుల పాటు వివిధ అంశాలపై ప్రయోగాలు నిర్వహించారు. మిషన్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన ఆయన తన టీమ్‌తో కలిసి నేలపైకి వచ్చారు.
Shubanshu Shukla | సోమవారం బయలుదేరిన బృందం
యాక్సిమ్ -4 మిషన్ అన్ డాకింగ్(Axim-4 Mission Undocking) సోమవారం సాయంత్రం నిర్వహించారు. అక్కడి నుంచి పయనమై మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు కాలిఫోర్నియా(California) తీరంలో వీరి డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ దిగింది.
