అక్షరటుడే, వెబ్‌డెస్క్: Tamil Film Industry | తమిళ సినీ పరిశ్రమ(Tamil Film Industry)లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ స్టంట్ మాస్టర్ రాజు ఓ సినీ షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఆర్య హీరోగా, పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కోసం జులై 13వ తేదీ (ఆదివారం) ఉదయం జరిగిన షూటింగ్ లో భాగంగా కార్ స్టంట్ చేస్తుండగా, ప్రమాదవశాత్తు ఆయన ఊహించని రీతిలో ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాదకర ఘటనతో కోలీవుడ్ మొత్తం షాక్‌కి గురైంది. స్టంట్ మాస్టర్ రాజు (Stunt Master Raju) అనేక ప్రముఖ తమిళ, తెలుగు సినిమాల్లో పనిచేశారు. ఆయన మృతిపై సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు.
Tamil Film Industry | ఘోర ప్రమాదం..
ఈ ఘటనపై నటుడు విశాల్ (Hero Vishal) తీవ్రంగా స్పందించారు. రాజుతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ, భావోద్వేగానికి లోనయ్యారు. షూటింగ్‌లో కార్ స్టంట్ చేస్తూ మాస్టర్ రాజు మృతి చెందాడన్న వార్త నన్ను ఎంతగానో కలచివేసింది. ఆయన ఇక మన మధ్య లేరన్న విషయం జీర్ణించుకోవడం చాలా కష్టం. చాలా సినిమాల్లో ఆయనతో పనిచేశాను. చాలా ధైర్యంగా, డెడ్‌లీ స్టంట్లు చేస్తుంటాడు. ఒక గొప్ప మిత్రుని, సహచరుణ్ని కోల్పోయాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. ఆయన కుటుంబానికి అండగా ఉంటాను అని ట్వీట్ చేశారు.
ఇంకా ఫైట్స్ మాస్టర్ సిల్వ(Fight Master Silva) కూడా తన ట్వీట్‌లో.. ఒక గొప్ప స్టంట్ ఆర్టిస్ట్‌ను కోల్పోయాం. స్టంట్ యూనియన్‌కి నిజంగా ఇది తీరని లోటు. రాజు లాంటి డెడికేటెడ్ ఆర్టిస్ట్ లేని లోటు ఎన్నటికీ తీరదు, అంటూ సంతాపం వ్యక్తం చేశారు. అయితే స్టంట్ మాస్టర్ రాజు మరణంపై అటు హీరో ఆర్య కానీ, డైరెక్టర్ పా. రంజిత్ (Director Pa. Ranjith) కానీ ఇప్పటి వరకు స్పందించకపోవడం గమనార్హం. స్టంట్స్ పట్ల అపారమైన అభిరుచి, నిబద్ధత ఉన్న రాజు మృతి సినీపరిశ్రమకి పెద్ద దెబ్బే అంటున్నారు. రాజు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ… ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సినీ అభిమానులు, సెలబ్రిటీలు ప్రార్థిస్తున్నారు.