అక్షరటుడే, బాన్సువాడ:Deo Ashok | వేసవి సెలవుల్లో విద్యార్థులు(Students) ఇంటివద్ద చదవడం, రాయడం ప్రాక్టీస్ చేయాలని.. సెల్ఫోన్లకు(Cellphones) దూరంగా ఉండాలని డీఈవో అశోక్(DEO Ashok) సూచించారు. మండలంలోని బోర్లం ప్రాథమిక పాఠశాల(Borlam Primary School)లో బుధవారం తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ.. చదువే విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయిస్తుందన్నారు. ప్రభుత్వ పాఠశాల(Government Schools)ల్లో అన్ని మౌలిక సదుపాయాలు ఉన్నాయని.. వాటిని విద్యార్థులు వినియోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ హెచ్ఎం వెంకటరమణ, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం గోపి, ఉపాధ్యాయులు అయ్యల సంతోష్, చైతన్య, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
