అక్షరటుడే, కామారెడ్డి: Fee reimbursement | ఫీజ్ రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలు విడుదల చేయాలని విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌ను (Collectorate) ముట్టడించేందుకు సోమవారం యత్నించారు. పోలీసులు విద్యార్థులను ధర్నాచౌక్ (Dharna Chowk) వద్దే అడ్డుకున్నారు. దీంతో వారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
Fee reimbursement | విద్యార్థులకు అనేక ఇబ్బందులు..
ఈ సందర్భంగా పీడీఎస్‌యూ(PDSU) జిల్లా అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ.. గత ఐదేళ్లుగా స్కాలర్షిప్(Scholarship), ఫీజు రీయింబర్స్మెంట్ రాక విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఇచ్చిన హామీలపైనే దృష్టి పెట్టిందని, విద్యారంగ సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు.
Fee reimbursement | సీఎం వద్దే విద్యాశాఖ ఉన్నప్పటికీ..
విద్యాశాఖ సీఎం వద్ద ఉందని, వెంటనే రూ. 8వేల కోట్ల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బకాయిలు విడుదల కాకపోవడంతో సర్టిఫికెట్లు ఇవ్వడానికి కళాశాలల యాజమాన్యాలు ఇబ్బందులకు గురి చేస్తున్నాయని వాపోయారు. విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టవద్దని వారు నినదించారు.
Read all the Latest News on Aksharatoday and also follow us in ‘X‘ and ‘Facebook‘