అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy | పట్టణంలోని ఎస్పీఆర్ పాఠశాలలో (SPR School) అడ్మిషన్ల పేరుతో వసూలు చేసిన డబ్బులను విద్యార్థులకు తిరిగి ఇవ్వాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఎస్ఎఫ్ఐ(SFI), బీవీఎం(BVM), ఎన్ఎస్యూఐ(NSUI) విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో శనివారం డీఈవో రాజుకు (DEO Raju) వినతిపత్రం అందజేశారు.
Kamareddy | గవర్నింగ్ బాడీ లేకుండానే..
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఎస్పీఆర్ పాఠశాలలో నిబంధనలకు విరుద్ధంగా అడ్మిషన్ల పేరుతో ఒక్కొక్క విద్యార్థి నుంచి రూ. 5వేల వసూలు చేశారని విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. అది కూడా గవర్నింగ్ బాడీ లేకుండానే ఫీజులు నిర్ణయించిన పాఠశాలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. విద్యా హక్కు చట్టాన్ని (Right to Education Act) అమలు చేయకుండా యజమాన్యం ఏకపక్షంగా ఫీజులను నిర్ణయించి వేలల్లో వసూలు చేస్తున్నారన్నారు.
Kamareddy | యాజమాన్యం చెప్పిన షాపుల్లోనే పుస్తకాలు..
యజమాన్యం చెప్పిన షాపులోనే పుస్తకాలను కొనాలని ఒత్తిడి చేస్తూ ఎక్కువ ధరలకు పుస్తకాలను అమ్ముతున్నారని ఆరోపించారు. ఐఐటీ తరగతి పేరుతో అదనంగా రూ. 15 వేల నుంచి రూ.20 వేలు వసూలు చేస్తూ దిశ ప్రోగ్రాం పేరుతో తల్లిదండ్రులను మోసం చేస్తున్నారన్నారు.
అడ్మిషన్ పేరుతో వసూలు చేసిన రూ. 5వేలను విద్యార్థులకు తిరిగి ఇవ్వాలని, లేనిపక్షంలో విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ (SFI) జిల్లా కార్యదర్శి అరుణ్ కుమార్, బీవీఎం(BVM) రాష్ట్ర కార్యదర్శి విఠల్, నాయకులు శ్యామ్, టింకు, స్టాలిన్, మనోజ్, సూఫీయాన్ తదితరులు పాల్గొన్నారు.