అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Jagityala | స్నేహితురాళ్లు అవమానించారిని ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. జగిత్యాల (Jagityala) జిల్లా జాబితాపూర్‌కు చెందిన కాటిపెల్లి నిత్య(21) హైదరాబాద్ కేపీహెచ్‌బీలోని ఓ ప్రైవేటు హాస్టల్‌లో ఉంటూ బీటెక్ (B tech) థర్డ్ ఇయర్ చదువుతోంది. అయితే ఆమెను చదువులో వెనుకబడ్డావంటూ.. స్నేహితురాళ్లు అవమానించారు.
ఈ క్రమంలో ఇటీవల తన స్వగ్రామానికి వెళ్లిన నిత్య ఈ నెల 2న గడ్డి మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ క్రమంలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిత్య మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఆమె స్నేహితురాళ్లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.