ePaper
More
    Homeజిల్లాలుకామారెడ్డిMinister Komati Reddy | కామారెడ్డి సమగ్రాభివృద్ధికి పటిష్ట చర్యలు

    Minister Komati Reddy | కామారెడ్డి సమగ్రాభివృద్ధికి పటిష్ట చర్యలు

    Published on

    అక్షరటుడే, నిజాంసాగర్​/బిచ్కుంద: Minister Komati Reddy | కామారెడ్డి జిల్లా సమగ్రాభివృద్ధికి ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Minister Komati Reddy) పేర్కొన్నారు. జిల్లాలోని జుక్కల్​ నియోజకవర్గంలో (Jukkal Constituency) పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు (MLA Lakshmi Kantha Rao) క్యాంప్​ కార్యాలయంలో సంక్షేమ పథకాలపై కలెక్టర్, పలు ఉన్నతాధికారులతో కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు.

    Minister Komati Reddy | సాగునీటి ప్రాజెక్టులు.. వైద్యారోగ్య సేవలు..

    ఈ సందర్భంగా వివిధ అంశాలపై మంత్రి సుదీర్ఘంగా సమీక్షించారు. విద్యుత్ లైన్ సమస్యలు, సాగునీటి ప్రాజెక్టులు, వైద్య ఆరోగ్య సేవలు, మిషన్ భగీరథ, అటవీ భూములు ఆక్రమణ తదితర అంశాలపై చర్చించారు. కాగా.. విద్యుత్​ సమస్యలపై మంత్రికి విన్నవించగా డిప్యూటీ సీఎంతో మాట్లాడి సబ్ స్టేషన్ మంజూరయ్యేలా కృషి చేస్తానని మంత్రి పేర్కొన్నారు.

    READ ALSO  Minister Komatireddy | రోడ్ల నిర్మాణాలకు భారీగా నిధులు: మంత్రి కోమటిరెడ్డి

    Minister Komati Reddy | పెండింగ్​ ప్రాజెక్టులపై సమీక్ష..

    నీటి పారుదల ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ కాల్వ నిర్మాణ పనులు, అవసరమైన భూసేకరణ పనుల పరిపాలన అనుమతులు మంజూరు చేయాలని మంత్రి అన్నారు. సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలపై నివేదిక అందించాలన్నారు. పెండింగ్ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సూచించారు. అవసరమైన ప్రతిపాదనలు జులై 9 నాటికి అందిస్తే తదుపరి కేబినెట్ సమావేశంలో ఆమోదం పొందుతుందని ఆయన తెలిపారు.

    Minister Komati Reddy | ట్రామా సెంటర్​ ఏర్పాటుకు చర్యలు..

    కామారెడ్డి జిల్లా మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల బోర్డర్ రిమోట్ ఏరియా ఉందని, కాబట్టి జుక్కల్​ నియోజకవర్గానికి 100 పడకల ఆస్పత్రికి ప్రతిపాదనాలు పంపాలని మంత్రి కోమటిరెడ్డి ఆదేశించారు. జాతీయ రహదారి దగ్గర ట్రామాసెంటర్​ అవసరం ఉందని, హైవే సమీపంలోని ఆస్పత్రిలో ట్రామా సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. సన్నరకం ధాన్యం, కూరగాయలు, ఆయిల్ పామ్ వంటి లాభసాటి పంటల సాగు పై రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు.

    READ ALSO  Philippines | పుట్టిన రోజునాడే కన్నుమూత.. ఫిలిప్పిన్స్ లో కామారెడ్డి జిల్లా వైద్య విద్యార్థి మృతి

    వ్యవసాయ విస్తరణ అధికారులు క్రాప్ బుకింగ్ పకడ్బందీగా చేయాలని, వాస్తవ పరిస్థితులకు రికార్డులకు చాలా తేడా ఉంటుందని, భవిష్యత్తులో ఇలా జరగడానికి వీలు లేదని అన్నారు. వ్యవసాయ పనిముట్లు సబ్సిడీ యూనిట్ల పట్ల రైతులకు అవగాహన కల్పించాలని మంత్రి పేర్కొన్నారు. డీఎంఎఫ్​టీ నిధులను ఆస్పత్రిలో అవసరమైన వైద్యపరికాలకు కొనుగోలు, పాఠశాలలో మౌళిక వసతుల ఏర్పాటుకు వినియోగించాలని మంత్రి కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్​కు (Collector Ashish Sangwan) సూచించారు.

    Minister Komati Reddy | ఇందిరమ్మ ఇళ్లపై..

    ఇందిరమ్మ ఇళ్లు (Indiramma Housing Scheme) దశల వారీగా అర్హులందరికీ అందుతాయని మంత్రి తెలిపారు. జిల్లాలో మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లు త్వరగా గ్రౌండింగ్​ చేసి నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా చూడాలన్నారు. రూ.5 లక్షలను 4 దశలలో లబ్ధిదారుల ఖాతాల్లో గ్రీన్ ఛానల్ ద్వారా జమ చేస్తామని పేర్కొన్నారు. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు లక్షల మేరకు అందించాలని చెప్పారు.

    READ ALSO  Central lighting | సెంట్రల్​ లైటింగ్​ పనుల్లో వేగం పెంచాలి

    కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ.. మంత్రి ఆదేశాల మేరకు ఆస్పత్రి నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదన సమర్పిస్తామన్నారు. మంత్రి వెంట ఎంపీ సురేశ్​ షెట్కార్​(MP Suresh Shetkar), ఎమ్మెల్యేలు లక్ష్మీ కాంతారావు, ఎమ్మెల్యే పటోళ్ల సంజీవ్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ విక్టర్, సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా అధికారులు, వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ చీకోటి మనోజ్ కుమార్, కాంగ్రెస్ నిజాంసాగర్ మండల అధ్యక్షుడు ఏలే మల్లికార్జున్, ఇతర ప్రజా ప్రతినిధులు అధికారులు పాల్గొన్నారు.

    Latest articles

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....

    Hydraa Commissioner | నాలాలను పరిశీలించిన హైడ్రా కమిషనర్

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Hydraa Commissioner | హైదరాబాద్ (Hyderabad)​ నగరంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లో నాలాలను హైడ్రా...

    More like this

    Nizamabad | ఆలయాలకు పాలక మండళ్లు.. ఎక్కడ ఎవరు ఛైర్మన్​ అంటే..

    అక్షరటుడే, ఇందూరు: Nizamabad నిజామాబాద్ నగరంలోని మూడు ప్రముఖ దేవాలయాలకు కొత్త పాలక మండళ్లు ఏర్పడ్డాయి. ఈ మేరకు...

    CM REVANTH | జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ అభివృద్ధికి స‌హ‌క‌రించాలి.. పీయూష్ ​గోయల్​కి సీఎం వినతి

    అక్షరటుడే, హైదరాబాద్: CM REVANTH : జ‌హీరాబాద్ ఇండ‌స్ట్రియ‌ల్ స్మార్ట్ సిటీ (Zaheerabad Industrial Smart City -...

    CM Revanth | రాష్ట్రంలో యూరియా కష్టాలు.. కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లిన సీఎం

    అక్షరటుడే, హైదరాబాద్: CM Revanth : రాష్ట్రంలో యూరియా కష్టాలు ఎదురవకుండా సీఎం రేవంత్​ రెడ్డి చర్యలు చేపట్టారు....