అక్షరటుడే, వెబ్‌డెస్క్:Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు(Domestic stock markets) లాభనష్టాల మధ్య ఊగిసలాడుతూ సాగుతున్నాయి. శుక్రవారం ఉదయం సెన్సెక్స్(Sensex) 67 పాయింట్ల స్వల్ప లాభంతో ప్రారంభమైనా వెంటనే 204 పాయింట్లు కోల్పోయింది. తిరిగి పుంజుకుని ఇంట్రాడే(Intraday)లో గరిష్టంగా 339 పాయింట్లు పెరిగింది. నిఫ్టీ 23 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా అమ్మకాల ఒత్తిడితో 58 పాయింట్లు పడిపోయింది. అక్కడినుంచి గరిష్టంగా 88 పాయింట్లు పైకి వచ్చింది. ఉదయం 11.30 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 68 పాయింట్ల నష్టంతో 83,170 వద్ద, నిఫ్టీ(NIfty) 25 పాయింట్ల నష్టంతో 25,380 వద్ద కొనసాగుతున్నాయి. వారాంతం కావడం, త్వరలో Q1 ఎర్నింగ్ సీజన్ మొదలు కానుండడం, వాణిజ్య ఒప్పందాల విషయంలో అమెరికా విధించిన పాజ్ గడువు సమీపిస్తుండడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో మార్కెట్లు స్తబ్ధుగా సాగుతున్నాయి.
Stock Market | మిశ్రమంగా..
బీఎస్‌ఈ(BSE)లో రియాలిటీ ఇండెక్స్ 0.64 శాతం, హెల్త్ కేర్, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్‌లు 0.54 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.51 శాతం, ఎనర్జీ, పీఎస్‌యూ సూచీలు 0.34 శాతం, ఎఫ్‌ఎంసీజీ ఇండెక్స్ 0.21 శాతం లాభాలతో ఉన్నాయి. మెటల్ ఇండెక్స్ 0.31 శాతం, ఆటో సూచీ 0.26 శాతం, టెలికాం సూచీ 0.14 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్(Small cap index) 0.31 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.29 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.04 శాతం లాభంతో కొనసాగుతున్నాయి.
Top gainers:బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 16 కంపెనీలు లాభాలతో 14 కంపెనీలు నష్టాలతో ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్ 2.01 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 1.04 శాతం, బీఈఎల్ 0.92 శాతం, ఎటర్నల్ 0.82 శాతం, టీసీఎస్ 0.57 శాతం లాభాలతో ఉన్నాయి.
Top losers:ట్రెంట్ 8.30 శాతం, టాటా స్టీల్ 1.36 శాతం, టెక్ మహీంద్రా 1.11 శాతం, మారుతి 0.83 శాతం, టైటాన్ 0.65 శాతం నష్టాలతో ఉన్నాయి.