అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు (Domestic Stock Markets) స్వల్ప నష్టాలతో కొనసాగుతున్నాయి. దేశీయంగా ఎలాంటి ప్రతికూలతలు లేకపోయినా.. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చిత పరిస్థితులకుతోడు రష్యా వాణిజ్య భాగస్వాములపై భారీ సుంకాలు (Heavy Tariffs) విధిస్తామన్న నాటో బెదిరింపులతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. బుధవారం ఉదయం నిఫ్టీ ఫ్లాట్‌గా ప్రారంభమవగా.. సెన్సెక్స్(Sensex) 36 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమెంది. ఒడిదుడుకులకు లోనవుతూ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్, నిఫ్టీ(Nifty) స్వల్ప నష్టాలతో కొనసాగుతున్నాయి.
Stock Market | అన్ని రంగాల్లో మిశ్రమ స్పందన..
అన్ని రంగాలు మిశ్రమంగా స్పందిస్తున్నాయి. బీఎస్‌ఈ(BSE)లో పీఎస్‌యూ బ్యాంక్ 0.36 శాతం, ఎఫ్‌ఎంసీజీ(FMCG) 0.19 శాతం, ఐటీ ఇండెక్స్ 0.17 శాతం, టెలికాం 0.16 శాతం లాభంతో కొనసాగుతున్నాయి. మెటల్(Metal) ఇండెక్స్ 0.73 శాతం, ఆటో ఇండెక్స్ 0.69 శాతం, కమోడిటీ 0.54 శాతం, కన్జూమర్ డ్యూరెబుల్ 0.31 శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.28 శాతం నష్టాలతో ఉన్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.07 శాతం లాభంతో ఉండగా.. లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.22 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.05 శాతం నష్టంతో కదలాడుతున్నాయి.
Top Gainers:బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 13 కంపెనీలు లాభాలతో 17 కంపెనీలు నష్టాలతో ఉన్నాయి. టెక్‌మహీంద్రా 1.09 శాతం, అదాని పోర్ట్స్ 093 శాతం, ఇన్ఫోసిస్ 0.64 శాతం, ఆసియా పెయింట్స్ 0.45 శాతం, ఎస్‌బీఐ 0.40 శాతం లాభాలతో సాగుతున్నాయి.
Top Losers:ఎటర్నల్ 1.86 శాతం, సన్‌ఫార్మా 1.16 శాతం, టాటా స్టీల్ 0.97 శాతం, ఎంఅండ్‌ఎం 0.91 శాతం,బజాజ్ ఫిన్‌సర్వ్ 0.84 శాతం నష్టాలతో ఉన్నాయి.