అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | వరుస నష్టాలకు బ్రేక్ పడింది. రిటైల్ ద్రవ్యోల్బణం (Retail inflation) ఆరేళ్ల కనిష్టానికి తగ్గడం, గ్లోబల్ మార్కెట్లు కూడా పాజిటివ్‌గా సాగుతుండడంతో మంగళవారం మన మార్కెట్లు రిలీఫ్ ర్యాలీ తీస్తున్నాయి.
ఉదయం సెన్సెక్స్ 20 పాయింట్ల స్వల్ప నష్టంతో ప్రారంభమై మరో 12 పాయిట్లు తగ్గింది. కనిష్టాల వద్ద లభించిన కొనుగోళ్ల మద్దతుతో 522 పాయింట్లు ఎగబాకింది. నిఫ్టీ (Nifty) ఏడు పాయింట్ల లాభంతో ప్రారంభమై అక్కడినుంచి ఇంట్రాడే (Intraday)లో గరిష్టంగా 157 పాయింట్లు పెరిగింది. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్(Sensex) 412 పాయింట్ల నష్టంతో 82,088 వద్ద, నిఫ్టీ 116 పాయింట్ల నష్టంతో 25,033 వద్ద కొనసాగుతున్నాయి.
Stock Market | ఆటో, రియాలిటీ స్టాక్స్‌లో జోరు..
ఆటో (Auto), రియాలిటీ, పీఎస్‌యూ బ్యాంక్ స్టాక్స్ జోరు కనబరుస్తున్నాయి. వరుస నష్టాల తర్వాత ఐటీ స్టాక్స్‌లో కొనుగోళ్ల మద్దతు లభిస్తోంది. దీంతో సూచీలు పాజిటివ్‌గా సాగుతున్నాయి. బీఎస్‌ఈలో ఆటో ఇండెక్స్ 1.49 శాతం, రియాలిటీ ఇండెక్స్ 1.41 శాతం పెరగ్గా.. పీఎస్‌యూ బ్యాంక్ (PSU bank) 1.06 శాతం లాభంతో ఉంది. ఐటీ ఇండెక్స్ 0.80 శాతం, హెల్త్‌కేర్ 0.72 శాతం, టెలికాం 0.69 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.60 శాతం, ఎఫ్‌ఎంసీజీ 0.60 శాతం, ఎనర్జీ 0.54 శాతం లాభాలతో ఉన్నాయి. యుటిలిటీ (Utility) ఇండెక్స్ 0.12 శాతం నష్టంతో కొనసాగుతోంది. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.91 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.55 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.51 శాతం లాభాలతో కదలాడుతోంది.
Top Gainers: బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో 25 కంపెనీలు లాభాలతో 5 కంపెనీలు నష్టాలతో ఉన్నాయి. సన్‌ఫార్మా 2.28 శాతం, ఎంఅండ్‌ఎం 1.59 శాతం, ఇన్ఫోసిస్ 1.37 శాతం, టాటా మోటార్స్ 1.07 శాతం, కొటక్ బ్యాంక్ 0.96 శాతం లాభాలతో సాగుతున్నాయి.