అక్షరటుడే, వెబ్‌డెస్క్: Stock Market | అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన టారిఫ్ (Trump Tariff) పాజ్ గడువు సమీపిస్తుండడంతో మార్కెట్లలో అనిశ్చితి నెలకొంది. ఈనెల 9వ తేదీతో గడువు ముగియనుంది. ఆ తర్వాత ఆయన ఎలా స్పందిస్తారోనన్న ఆందోళనతో మార్కెట్లు నష్టాల్లో సాగుతున్నాయి. బుధవారం ఉదయం సెన్సెక్స్ 93 పాయింట్ల లాభంతో ప్రారంభమై ఇంట్రాడే(Intraday)లో మరో 145 పాయింట్లు పెరిగింది. ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగడంతో అక్కడినుంచి 464 పాయింట్లు పడిపోయింది. 47 పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టీ (NIfty).. మరో 20 పాయింట్లు మాత్రమే పెరిగింది. అక్కడినుంచి 145 పాయింట్లు నష్టపోయింది. ఉదయం 11.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ (Sensex) 150 పాయింట్ల నష్టంతో 83,549 వద్ద, నిఫ్టీ 47 పాయింట్ల నష్టంతో 25,494 వద్ద కొనసాగుతున్నాయి.
Stock Market | అమ్మకాల ఒత్తిడి..
మెటల్(Metal), టెలికాం మినహా అన్ని రంగాలలో అమ్మకాల ఒత్తిడి కనిపిస్తోంది. బీఎస్‌ఈలో మెటల్ 0.72 శాతం, మెటల్ 0.56 శాతం, టెలికాం 0.47 శాతం, కమోడిటీ ఇండెక్స్ 0.47 శాతం, ఐటీ(IT) సూచీ 0.23 శాతం లాభాలతో ఉన్నాయి. రియాలిటీ ఇండెక్స్ 0.53 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.53 శాతం, క్యాపిటల్ గూడ్స్ ఇండెక్స్ 0.47 శాతం, ప్రైవేట్ బ్యాంక్ సూచీ 0.46 శాతం, ఇన్‌ఫ్రా 0.36 శాతం, పీఎస్‌యూ బ్యాంక్ సూచీ 0.32 శాతం నష్టంతో కదలాడుతున్నాయి. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.29 శాతం, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.18 శాతం, మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.16 శాతం నష్టంతో కొనసాగుతున్నాయి.
Top gainers:బీఎస్‌ఈలో 14 కంపెనీలు లాభాలతో 16 కంపెనీలు నష్టాలతో ఉన్నాయి. టాటా స్టీల్ 1.84 శాతం, అల్ట్రాటెక్ సిమెంట్ 1.36 శాతం, ఎయిర్‌టెల్ 1.20 శాతం, ఎన్టీపీసీ 0.72 శాతం, సన్‌ఫార్మా 0.59 శాతం లాభాలతో ఉన్నాయి.
Top losers:బజాజ్ ఫిన్‌సర్వ్ 1.86 శాతం, బజాజ్ ఫైనాన్స్ 1.39 శాతం, ఎటర్నల్ 1.23 శాతం, బీఈఎల్ 1.04 శాతం, ఎల్‌టీ 1.04 శాతం నష్టాలతో ఉన్నాయి.