అక్షరటుడే, వెబ్‌డెస్క్: stock markets | దేశీయ స్టాక్ మార్కెట్లు (Domestic stock markets) లాభాలతో gain కొత్త వారాన్ని ప్రారంభించాయి. సోమవారం ఉదయం 160 పాయింట్ల లాభంతో ప్రారంభమైన సెన్సెక్స్ (Sensex).. ఇంట్రాడేలో గరిష్టంగా 548 పాయింట్లు పెరిగింది.
73 పాయింట్ల లాభంతో ప్రారంభమైన నిఫ్టీ (Nifty).. 180 పాయింట్లు లాభపడింది. భారత్, పాక్‌ల India and Pakistan మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతుండడంతో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
దీంతో సెన్సెక్స్ sensex 80,730 నుంచి 81 వేల పాయింట్ల మధ్యలో, నిఫ్టీ nifty 24,440 నుంచి 24520 పాయింట్ల మధ్య కదలాడుతున్నాయి. అదాని పోర్ట్స్(Adani ports), బజాజ్ ఫిన్‌సర్వ్ Bajaj Finserv, ఆసియా పెయింట్స్, ట్రెంట్ టాప్ గెయినర్లుగా కొనసాగుతుండగా.. కొటక్ బ్యాంక్ (Kotak bank), ఎస్‌బీఐ, ఓఎన్జీసీ, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, డాక్టర్ రెడ్డీస్ వంటి స్టాక్స్ నిఫ్టీని కిందికి లాగుతున్నాయి.
ఉదయం 2.45 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ sensex 360 పాయింట్ల లాభంతో, నిఫ్టీ (Nifty) 130 పాయింట్ల లాభంతో కొనసాగుతున్నాయి.
stock markets | బ్యాంకింగ్ సెక్టార్ మినహా..
బీఎస్‌ఈ(BSE)లో బ్యాంకింగ్ మినహా అన్ని ప్రధాన సెక్టార్లు major sectors లాభాలతో కొనసాగుతున్నాయి. మిడ్ క్యాప్ (Mid cap), స్మాల్‌క్యాప్ ఇండెక్స్‌లు small cap indices 1 శాతం లాభాలతో, లార్జ్ క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం లాభంతో కొనసాగుతున్నాయి.
ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ (Oil and Gas) 1.69 శాతం లాభాలతో బీఎస్‌ఈలో టాప్ గెయినర్‌గా నిలిచింది. ఆటో, ఎనర్జీ, పవర్ ఇండెక్స్‌లు power indices ఒక శాతానికిపైగా లాభంతో ఉండగా.. హెల్త్‌కేర్ (Health care), పీఎస్‌యూ, క్యాపిటల్ గూడ్స్ సెక్టార్ స్టాక్స్ capital goods sector stocks లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకెక్స్ మాత్రం 0.87 శాతం నష్టంతో ఉంది.
stock markets | Top Gainers..
బీఎస్‌ఈ సెన్సెక్స్ (SEnsex) 30 ఇండెక్స్‌లో 24 కంపెనీలు లాభాలతో ముగియగా 6 కంపెనీలు మాత్రమే నష్టాలతో కొనసాగుతున్నాయి. అదాని పోర్ట్స్ అత్యధికంగా 7.42 శాతం లాభంతో ఉంది. బజాజ్ ఫిన్‌సర్వ్ Bajaj Finserv, ఎటర్నల్ (Eternal), ఆసియా పెయింట్స్ రెండు శాతానికిపైగా లాభంతో ఉండగా.. పవర్ గ్రిడ్, టాటా మోటార్స్, ఐటీసీ (ITC), ఎంఅండ్‌ఎం, బజాజ్ ఫైనాన్స్, హెచ్‌యూఎల్ ఒక శాతానికిపైగా లాభంతో కొనసాగుతున్నాయి.
stock markets | Top Losers..
కొటక్ బ్యాంక్ (Kotak bank) త్రైమాసిక ఫలితాలు నిరాశాజనకంగా ఉండడంతో 4.87 శాతం పడిపోయింది. ఎస్‌బీఐ 1.1 శాతం నష్టపోగా యాక్సిస్ బ్యాంక్ (Axis bank), ఇండస్ ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి.