More
    HomeసినిమాShruti Haasan | నా శరీరం.. నా ఇష్టం.. అవ‌స‌ర‌మైతే అది కూడా చేయించుకుంటానంటూ శృతి...

    Shruti Haasan | నా శరీరం.. నా ఇష్టం.. అవ‌స‌ర‌మైతే అది కూడా చేయించుకుంటానంటూ శృతి షాకింగ్ కామెంట్స్

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Shruti Haasan | లోక‌నాయ‌కుడు ‘కమల్ హాసన్'(Kamal Haasan) నట వారసురాలిగా సినీ రంగ ప్రవేశం చేసిన నటి శృతి హాసన్. దశాబ్దంన్నర కాలం నుంచి తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ తనదైన శైలిలో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ కుర్ర హీరోల‌తో పాటు స్టార్ హీరోల‌తోనూ నటిస్తోంది.

    హీరోలకు హిట్ ని ఇచ్చే మోస్ట్ లక్కీ.యెస్ట్ హీరోయిన్ అనే పేరు కూడా శృతి హాసన్(Shruthi Haasan)కు ఉంది. తెలుగు చిత్ర పరిశమ్రలో దాదాపుగా అగ్ర హీరోలందరితోనూ జత కట్టిన శృతి, ఏ విష‌యం గురించి అయినా మొహ‌మాటం లేకుండా మాట్లాడేస్తుంటుంది.

    Shruti Haasan | అంతా నా ఇష్టం..

    తాజాగా త‌న బాడీ విష‌యంలో షాకింగ్ కామెంట్స్ చేసింది శృతి హాస‌న్ (Shruti Haasan). త‌న ముక్కుకు చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీ(Plastic surgery) గురించి, ఆ నిర్ణయం వెనుక గల కారణాలను శృతిహాసన్ సూటిగా వివరించింది. “టీనేజ్‌లో ఉన్నప్పుడు నా ముక్కు నాకు నచ్చేది కాదు, అందుకే ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను. ఇక నా ముఖం మరింత ఆకర్షణీయంగా కనిపించడానికి ఫిల్లర్స్ కూడా వాడాను” అని చెప్పుకొచ్చింది.

    READ ALSO  Shekhar Kammula | నాని-శేఖ‌ర్ క‌మ్ముల ప్రాజెక్ట్ ఎప్పుడు మొద‌లు కానుంది.. ఇదిగో క్లారిటీ..!

    “ఈ విషయాలు దాచాల్సిన అవసరం నాకు కనిపించలేదు. చాలా సందర్భాల్లో ఈ విషయాన్ని చెప్పాను. కొందరు ఇలాంటివి బయటకు చెప్పడానికి ఇష్టపడరు, అది వారి వ్యక్తిగత అభిప్రాయం. అయితే దాన్ని నేను గౌరవిస్తాను. అలాగే, నా విషయాలను ధైర్యంగా చెప్పుకొనే స్వేచ్ఛ నాకు ఉంది. అది తప్పు కాదని నేను నమ్ముతున్నాను” అంటూ శృతి పేర్కొంది.

    “భవిష్యత్తులో అవసరమైతే ఫేస్‌లిఫ్ట్(Facelift) కూడా చేయించుకుంటాను. ఏదైనా నా నిర్ణయం. ఇతరులకు ఇబ్బంది కలగనంత వరకు, నా శరీరం గురించి నేను తీసుకునే నిర్ణయాలను, దాని గురించి ఎవరూ ప్రశ్నించాల్సిన అవసరం లేదు” అంటూ శృతి హాస్న ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది.

    ఇక, శృతి హాసన్ ప్రస్తుతం రజనీకాంత్, నాగార్జున కాంబోలో తెరకెక్కుతున్న ‘కూలీ’లో(Coolie) హీరోయిన్ గా చేస్తోంది. ఇళయ దళపతి విజయ్‌ లాస్ట్ మూవీగా పిలవబడుతున్న జన నాయగాన్ లో ఒక ముఖ్య పాత్ర పోషిస్తోంది.

    READ ALSO  Samantha | సమంతని పరుగులు పెట్టించిన ఫొటోగ్రాఫర్స్.. స్టాప్ గాయ్స్ అంటూ ఆగ్రహం

    విజయ్ సేతుపతి అప్ కమింగ్ మూవీ ‘ట్రైన్’లోనూ హీరోయిన్ గా చేస్తోంది. ఈ మూడు కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ప్రెస్టేజియస్ట్ చిత్రాలే.. వీటిల్లో ఒక చిత్రం హిట్టైనా శృతి జోరు మాములుగా ఉండ‌దు.

    Latest articles

    KOS Nizamabad | కేవోఎస్​లో యోగా డే

    అక్షరటుడే, ఇందూరు: KOS Nizamabad | నగరంలోని సుభాష్ నగర్​లో కాకతీయ ఒలంపియాడ్ స్కూల్​ (Kakatiya Olympiad School)లో...

    Yoga Day | జిల్లా సెంట్రల్ జైలులో యోగా దినోత్సవం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Yoga Day | జిల్లా కేంద్రంలోని సెంట్రల్ జైలులో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (International...

    Bhadrachalam Darshan | రాములోరి భక్తులకు గుడ్ న్యూస్.. భద్రాచలం ఆలయంలో డిజిటల్ సేవలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Bhadrachalam Darshan | భద్రాచలంలో (Bhadrachalam) కొలువైన రాములోరి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు(Devotees)...

    Haryana | ప్రాణం తీసి.. పారిపోయిందని చెప్పారు

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Haryana | ఓ వివాహితను అత్తింటి వారు హత్య చేశారు. ఇంటి ఆవరణలోనే ఆమెను పూడ్చి పెట్టి.....

    More like this

    KOS Nizamabad | కేవోఎస్​లో యోగా డే

    అక్షరటుడే, ఇందూరు: KOS Nizamabad | నగరంలోని సుభాష్ నగర్​లో కాకతీయ ఒలంపియాడ్ స్కూల్​ (Kakatiya Olympiad School)లో...

    Yoga Day | జిల్లా సెంట్రల్ జైలులో యోగా దినోత్సవం

    అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Yoga Day | జిల్లా కేంద్రంలోని సెంట్రల్ జైలులో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని (International...

    Bhadrachalam Darshan | రాములోరి భక్తులకు గుడ్ న్యూస్.. భద్రాచలం ఆలయంలో డిజిటల్ సేవలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Bhadrachalam Darshan | భద్రాచలంలో (Bhadrachalam) కొలువైన రాములోరి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు(Devotees)...