అక్షరటుడే, కామారెడ్డి:SRK VRK College | ఇంటర్ ఫలితాల్లో(Inter Results) పట్టణంలోని ఎస్ఆర్కే, వీఆర్కే విద్యార్థులు(Students) ప్రభంజనం సృష్టించారు. ఫస్టియర్లో వీఆర్కే కళాశాలకు చెందిన మైథిలి ఎంపీసీ 467/470, నవోదయ బైపీసీ 434/440, అనన్య సీఈసీ 491/500, ఒకేషనల్ ఫలితాలలో అఖిల ఎంపీహెచ్డబ్ల్యూ 496/500, ప్రభంజన్ ఎంఎల్టీ 488/500, జస్వంత్ ఈటీ 464/500 సాధించగా సెకండియర్లో ఏ.పూర్వజ బైపీసీ 994/1000, విద్వేష్ ఎంపీసీ 993/1000, నందిని సీఈసీ 935/1000 మార్కులు సాధించారు.
ఇంటర్ ప్రథమ సంవత్సరం(Inter First year)లో విద్యార్థులు వివిధ గ్రూపులలో స్టేట్ టాపర్లు(State Toppers)గా నిలిచారు. అలాగే ఎస్ఆర్కే కళాశాలకు చెందిన విద్యార్థులు సెకండియర్లో ఇందువర్షా 991/1000, ఇంటర్ సెకండియర్లో శ్రీచరణ్ ఎంపీసీ 464/470, శ్రీజ సీఈసీ 461/600 మార్కులు సాధించారు. ఈ సందర్భంగా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం(Inter Nodal Officer Sheikh Salam) విద్యార్థిని విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్, సీఈవో డా.జైపాల్ రెడ్డి, ప్రిన్సిపాల్ నరేష్ కుమార్, ఎస్ఆర్కే డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ దత్తాత్రి, శంకర్, డీన్ నవీన్ కుమార్, తిరుపతి రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మహేష్ కుమార్, బాల్ రెడ్డి, అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.