అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sri Ramayana Yatra | భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) IRCTC నిర్వహిస్తున్న ప్రత్యేక రైలు యాత్ర ‘శ్రీరామాయణ యాత్ర’ జులై 25న ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్ (Safdarjung Railway Station) నుంచి ప్రారంభం కానుంది. ఇది ఐఆర్‌సీటీసీ నిర్వహిస్తున్న ఐదో శ్రేణి శ్రీరామాయణ యాత్ర. ఈ పుణ్యయాత్ర 17 రోజుల పాటు కొనసాగనుంది. ఇందులో భక్తులకు శ్రీరాముని జీవన ప్రయాణానికి సంబంధించి 30కి పైగా పవిత్ర క్షేత్రాలను దర్శించే అవకాశం కలుగుతుంది.
Sri Ramayana Yatra | ఛాన్స్ మిస్ చేసుకోకండి..
యాత్ర అయోధ్య(Ayodhya) నుంచి మొదలై, నందిగ్రామ్, సీతామఢి, జానక్‌పుర్ (నేపాల్), బక్సర్, వారణాసి, ప్రయాగ్‌రాజ్, చిత్రకూట్, నాసిక్, హంపి తదితర ప్రముఖ ధార్మిక కేంద్రములను కవర్ చేస్తూ, చివరగా రామేశ్వరం (Rameshwaram)లో ముగియనుంది. ఈ యాత్రను అత్యంత సౌకర్యవంతంగా నిర్వహించేందుకు ఐఆర్‌సీటీసీ అన్ని ఏర్పాట్లూ పూర్తి చేసింది. యాత్ర సమయంలో త్రీ స్టార్ హోటళ్లలో(Three Star Hotels) వసతి, మంచి భోజనం, ప్రయాణ బీమా, AC బస్సుల్లో లోకల్ టూర్ వంటి సదుపాయాలు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.
ప్యాకేజీ ధరలు ఇలా ఉన్నాయి. థర్డ్ AC – ₹1,17,975 కాగా, సెకండ్ AC – ₹1,40,120, ఫస్ట్ AC కూపె – ₹1,79,515, ఫస్ట్ AC క్యాబిన్ – ₹1,66,380. ఈ ప్యాకేజీలో రైలు ప్రయాణం, హోటల్ వసతి, భోజనం, సైట్‌సీయింగ్, బీమా మొదలైన అన్ని ఖర్చులు కలిపి ఉంటాయి. ఈ యాత్ర భక్తులకు కేవలం ధార్మిక ప్రదేశాల సందర్శన మాత్రమే కాక, శ్రీరాముని జీవన పాఠాలను తలచుకునే అవకాశాన్ని కల్పించనుంది. శ్రీరాముని అడుగుల జాడల్లో పయనించాలనుకునే భక్తుల కోసం ఇదొక అపూర్వమైన అవకాశం అని ఐఆర్‌సీటీసీ అధికారులు(IRCTC Officers) తెలిపారు. యాత్రలో పాల్గొనాలనుకునే భక్తులు IRCTC అధికారిక వెబ్‌సైట్ లేదా దగ్గర్లోని IRCTC టూరిజం కార్యాలయం ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.