అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: Nizamabad CP | క్రీడలు మనిషి జీవితాన్ని మార్చేస్తాయని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య (CP Sai Chaitanya) అన్నారు. మంగళవారం జరిగిన రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్ ఛాంపియన్షిప్ పోటీల (state-level football championship competition) ముగింపు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఫుట్‌బాల్ అంటే ఆషామాషీ క్రీడ కాదని.. టెక్నిక్‌తో కూడిన ఆట కాబట్టి సాధన చేసినప్పుడే ఆటలో పరిపూర్ణత వస్తుందని పేర్కొన్నారు. చదువుతోపాటు క్రీడలు అవసరమని రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది రూ.350కోట్ల నిధులను క్రీడాభివృద్ధి కోసం కేటాయించిందని చెప్పారు.
Nizamabad CP | ప్రథమ స్థానం సాధించిన రంగారెడ్డి..
ఫుట్‌బాల్ టోర్నీలో (football tournament) రంగారెడ్డి ప్రథమస్థానం సాధించగా.. నిజామాబాద్ జట్లు రెండోస్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా జట్లకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా ఒలింపిక్ సంఘం కార్యదర్శి బొబ్బిలి నర్సయ్య, జిల్లా ఫుట్సంబాల్ సంఘం అధ్యక్షుడే ఖుద్దూస్, ఫుట్‌బాల్ కోచ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.