అక్షరటుడే, హైదరాబాద్: SpiceJet : విమానంలో సాంకేతిక లోపం తలెత్తడం సర్వ సాధారణంగా మారింది. సరిగ్గా ప్రయాణానికి ముందు ఇలా జరగడంతో ప్రయాణికులు Passengers తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
ఇటీవలి ఈ ఘటనలకు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం Shamshabad International Airport లో మరో విమానం సాంకేతిక లోపంతో నిలిచిపోయింది.
SpiceJet : స్పైస్ జెట్లో..
శంషాబాద్ నుంచి తిరుపతి Tirupati వెళ్లాల్సిన స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. స్పైస్ జెట్ ఎస్జీ-2138 విమానంలో సాంకేతిక లోపాన్ని పైలట్ గుర్తించారు. దీంతో సదరు విమానాన్ని స్పైస్ జెట్ ఎయిర్ వేస్ అధికారులు రద్దు చేశారు.
ఫలితంగా ఆ విమానం flight లో తిరుపతి వెళ్లాల్సిన 54 మంది ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. వారిని మరో విమానంలో గమ్యానికి పంపేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
తరచూ ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం ఆందోళన కలిగిస్తోంది. అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ తర్వాత స్పైస్ జెట్ విమానాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తడం మరింత ఎక్కువయ్యాయి.