అక్షరటుడే, కామారెడ్డి: SP Rajesh Chandra | ఫోన్లను అశ్రద్ధ చేస్తే వ్యక్తిగత, సామాజిక భద్రతకు భంగం ఏర్పడుతుందని ఎస్పీ రాజేష్ చంద్ర పేర్కొన్నారు. పట్టణంలో శనివారం పోలీస్ కార్యాలయంలో (Kamareddy Police office) మాట్లాడారు.
బాధితులు పోగొట్టుకున్న సుమారు 130 ఫోన్లను రికవరీ చేశామని.. త్వరలోనే బాధితులకు అప్పగిస్తామన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నిత్యం మనం ఉపయోగించే మొబైల్ ఫోన్లపై అశ్రద్ధ మంచిది కాదన్నారు. మొబైల్ రికవరీలలో (Mobile Recovery) రాష్ట్రంలోని జిల్లాలలో కమిషనరేట్లను మినహాయిస్తే కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు.
SP Rajesh Chandra | ఫోన్ చోరీకి గురైతే వెంటనే ఫిర్యాదు చేయాలి
మొబైల్ పోయినా.. చోరీకి గురైన వెంటనే సంబంధిత పోలీసు స్టేషన్కు వెళ్లి దరఖాస్తు ఇవ్వాలని ఎస్పీ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో పోయిన సెల్ఫోన్ల రికవరీ కోసం ప్రత్యేక టీం ఏర్పాటు చేశామన్నారు. 15 రోజుల్లో ఈ టీం 130 ఫోన్లను రికవరీ చేశారన్నారు. మొబైల్ ఫోన్ల రికవరీలో ప్రతిభ కనబర్చిన టీం సభ్యులను ఎస్పీ అభినందించారు. రికవరీ చేసిన ఫోన్ల వివరాలను బాధితులకు అందజేస్తామని, బాధితులు జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చి సంబంధిత వివరాలు చూపించి ఫోన్లు తీసుకుని వెళ్లాలని సూచించారు.