More
    Homeజిల్లాలుకామారెడ్డిKamareddy Sp Rajesh Chandra | పోలీస్‌ బాస్‌ దూకుడు.. విధుల్లో అలసత్వంపై కొరడా

    Kamareddy Sp Rajesh Chandra | పోలీస్‌ బాస్‌ దూకుడు.. విధుల్లో అలసత్వంపై కొరడా

    Published on

    అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Sp Rajesh Chandra | కామారెడ్డి జిల్లా kamareddy sp బాస్‌గా బాధ్యతలు చేపట్టిన మొదటి రోజు నుంచే ఎస్పీ రాజేష్‌ చంద్ర sp rajesh chandra దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అన్ని ఠాణాలు చుట్టేస్తున్న ఆయన, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. గడిచిన వారం రోజుల్లో ఇద్దరు ఎస్సైలపై సస్పెన్షన్‌ si suspension వేటు వేయించడమే కాకుండా.. పలువురు సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. దీంతో జిల్లా పోలీసు శాఖలో మిగతా అధికారులు, సిబ్బందిలో వణుకు మొదలైంది.

    జిల్లా పోలీసు శాఖలో ఇదివరకు కొందరు అధికారులు ఆడిందే ఆట, పాడిందే పాటలా పరిస్థితి ఉండేది. ప్రత్యేకించి ఓ సీఐ అన్నీ తానై వ్యవహరించారు. పోలీసు ఉన్నతాధికారిని తన గుప్పిట్లో ఉంచుకుని సివిల్‌ సెటిల్‌మెంట్లకు పాల్పడ్డారు. ఆయన చెబితే ఏ పని అయినా ఇట్టే జరిగిపోయేది. కాగా.. ఇప్పటికీ ఆయన ఓ కీలక స్టేషన్‌కు ఎస్‌హెచ్‌వోగా కొనసాగుతున్నారు. అయితే మార్చి 10న జిల్లా ఎస్పీగా రాజేష్‌చంద్ర బాధ్యతలు స్వీకరించిన తర్వాత పరిణామాలన్నీ ఒక్కసారిగా మారిపోయాయి.

    READ ALSO  Prashanth Kishor | సీఎం రేవంత్​రెడ్డిపై ప్రశాంత్​ కిశోర్​ ఆగ్రహం.. ఎందుకో తెలుసా!

    Kamareddy Sp Rajesh Chandra | తనదైన శైలిలో వ్యవహరిస్తున్న బాస్‌

    జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన వెంటనే పూర్తిస్థాయి పట్టు సాధించేలా నూతన బాస్‌ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే నిత్యం ఏదో ఒక స్టేషన్‌కు తనిఖీకి వెళ్తున్నారు. ఉదయం కనీసం గంటకు పైగా సెల్‌ కాన్ఫరెన్సు నిర్వహిస్తున్నారు. తనకు ప్రజల నుంచి అందే ఫిర్యాదులపై ఆయనే స్వయంగా ఎప్పటికప్పుడు మానిటరింగ్‌ చేస్తున్నారు. ఎస్‌బీ విభాగాన్ని పూర్తి అప్రమత్తం చేసి.. కిందిస్థాయి అధికారులు, సిబ్బంది పనితీరుపై నివేదికలు తెప్పించుకుంటున్నారు.

    Kamareddy Sp Rajesh Chandra | వరుస చర్యలతో వణుకు

    బాన్సువాడలో కల్లు దుకాణం వద్ద ఓ వ్యక్తి పట్ల దురుసుగా ప్రవర్తించిన ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్‌ చేశారు. ఆ తర్వాత జుక్కల్‌ పీఎస్‌లో పనిచేస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లను హెడ్‌ క్వార్టర్‌కు అటాచ్‌ చేశారు. బాధితుల వద్ద డబ్బులు తీసుకుంటున్నాడన్న ఆరోపణలతో జుక్కల్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ అంబర్‌ సింగ్‌పై సస్పెన్షన్‌ వేటు వేశారు. తాడ్వాయి ఎస్సై వెంకటేశ్వర్లు చెప్పాపెట్టకుండా తన ఊరికి వెళ్లడంతో ఆయనపై సస్పెన్షన్‌ వేటు వేయించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన రామారెడ్డి ఎస్సై నరేశ్‌పై ఐజీ కార్యాలయానికి రిపోర్టు పంపగా.. విధుల నుంచి తొలగిస్తూ ఐజీ చంద్రశేఖర్‌ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వరుస చర్యలతో మిగతా అధికారులు, సిబ్బందిలో వణుకు మొదలైంది. ఇతర ప్రాంతాల్లో కుటుంబాలు ఉన్న వారంతా అలర్ట్‌ అవ్వడమే కాకుండా.. సంబంధిత పోస్టింగ్‌ ఉన్న హెడ్‌క్వార్టర్‌లోనే ఉండిపోతున్నారు. ప్రత్యేకించి మొన్నటి వరకు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారంతా.. తాజాగా తమ తీరు మార్చుకుని ఫిర్యాదు వచ్చిన వెంటనే స్పందిస్తున్నారని తెలుస్తోంది. మరోవైపు కొందరు బదిలీ ప్రయత్నాలు కూడా చేసుకుంటున్నారని తెలుస్తోంది.

    READ ALSO  Minister Seethakka | గ్రూప్​ రాజకీయాలను పక్కన పెట్టండి.. మంచి​ కార్యకర్తలుగా పేరు తెచ్చుకోండి..: మంత్రి సీతక్క

    Latest articles

    Pashamylaram | పాశమైలారం పేలుడులో నవ దంపతుల మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Pashamylaram | వారిద్దరు వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చారు. పేద కుటుంబాల్లో పుట్టి కష్టపడి చదువుకొని ఒకే...

    Ramchander Rao | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు

    అక్షరటుడే,ఇందూరు: Ramchander Rao | భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రాంచందర్ రావును మంగళవారం...

    Gandhari | ఎరువుల కోసం రోడ్డెక్కిన రైతన్న

    అక్షరటుడే, గాంధారి: Gandhari | ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కారు. మండలంలోని ప్రాథమిక వ్యవసాయం సంఘం వద్ద యూరియా...

    Stock Market | లాభాలతో ముగిసిన సూచీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: Stock Market | ఇన్వెస్టర్లు(Investors) లాభాల స్వీకరణతో దిగడంతో మంగళవారం దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఒడిదుడుకుల...

    More like this

    Pashamylaram | పాశమైలారం పేలుడులో నవ దంపతుల మృతి

    అక్షరటుడే, వెబ్​డెస్క్:Pashamylaram | వారిద్దరు వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చారు. పేద కుటుంబాల్లో పుట్టి కష్టపడి చదువుకొని ఒకే...

    Ramchander Rao | బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు

    అక్షరటుడే,ఇందూరు: Ramchander Rao | భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన రాంచందర్ రావును మంగళవారం...

    Gandhari | ఎరువుల కోసం రోడ్డెక్కిన రైతన్న

    అక్షరటుడే, గాంధారి: Gandhari | ఎరువుల కోసం రైతులు రోడ్డెక్కారు. మండలంలోని ప్రాథమిక వ్యవసాయం సంఘం వద్ద యూరియా...