అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Interest Rates | పోస్ట్ ఆఫీస్ (Post Office) పొదుపు పథకాల్లో ఎంతో మంది తమ డబ్బులను దాచుకుంటారు. చిన్న చిన్న మొత్తాలను మదుపు (Invest) చేస్తుంటారు. బయట పెట్టుబడులపై రిస్క్ ఉండటంతో చాలా మంది మధ్య తరగతి వారు పోస్ట్ ఆఫీసులో తమ డబ్బులను మదుపు చేస్తారు. అయితే కేంద్ర ప్రభుత్వం పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ పథకాల వడ్డీ రేట్లపై మూడు నెలలకు ఒకసారి సమీక్షిస్తుంది. అవసరం అనుకుంటే వడ్డీ రేట్లను మారుస్తుంది. తాజాగా కేంద్రం జులై నుంచి సెప్టెంబర్ (రెండో త్రైమాసికం) వరకు పొదుపు పథకాల వడ్డీ రేట్లను (Interest Rates) ఖరారు చేసింది. అయితే గతంతో పోలిస్తే వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు.
Interest Rates | ఆరోసారి ఎలాంటి మార్పు లేదు
గత ఆరు త్రైమాసికాల నుంచి కేంద్రం పొదుపు పథకాల వడ్డీ రేట్లను మార్చడం లేదు. జూన్ నుంచి సెప్టెంబర్ క్వార్టర్‌కు సంబంధించి వడ్డీ రేట్లు గత త్రైమాసికానికి సంబంధించినవే కొనసాగిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ మేరకు సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
Interest Rates | వడ్డీ రేట్ల వివరాలు.. (శాతాల్లో)
- పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ : 4
- ఏడాది ఫిక్స్డ్ డిపాజిట్ : 6.9
- రెండేళ్ల డిపాజిట్ : 7
- మూడేళ్ల డిపాజిట్ : 7.1
- ఐదేళ్ల డిపాజిట్ : 7.5
- ఐదేళ్ల రికరింగ్ డిపాజిట్ : 6.7
- సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం : 8.2
- నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ : 7.7
- పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ : 7.1
- కిసాన్ వికాస్ పత్ర : 7.5
- సుకన్య సమృద్ధి యోజన : 8.2