అక్షరటుడే, వెబ్‌డెస్క్: Phone Tapping Case | ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్‌రావు(Prabhakar Rao)ను ఇప్పటికే పలుమార్లు అధికారులు విచారించారు. మంగళవారం సైతం ఆయనను విచారించిన సిట్.. బుధవారం సైతం విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. దీంతో నేడు మరోసారి ఆయనను అధికారులు ప్రశ్నించనున్నారు.
Phone Tapping Case | ఫోన్ స్వాధీనం
బీఆర్ఎస్ హయాంలో ఎస్ఐబీ చీఫ్‌గా వ్యవహరించిన ప్రభాకర్‌రావు తన టీమ్‌తో కలిసి ప్రతిపక్ష నాయకులతో పాటు జడ్జీలు, సినీ ప్రముఖులు, వ్యాపారుల ఫోన్లు ట్యాప్(Phone Tapping Case) చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో దీనిపై కేసు నమోదైంది. కేసు నమోదు కావడంతో అమెరికా పారిపోయిన ప్రభాకర్‌రావు గత నెలలో తిరిగి వచ్చారు. అప్పటి నుంచి అధికారులు ఆయనను పలుమార్లు విచారణకు పిలిచారు. ఇందులో భాగంగా ప్రభాకర్ ఫోన్‌ను అధికారులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు.
అసెంబ్లీ ఎన్నికల (Assembly Elections) సమయంలో ప్రభాకర్‌రావు మూడు ఫోన్లు వినియోగించినట్లు సిట్ గుర్తించింది. వీటిని అప్పగించాలని కొన్ని రోజులుగా అడుగుతున్నా.. ప్రభాకర్‌రావు వాయిదా వేస్తూ వచ్చారు. మంగళవారం ఒక ఫోన్‌ను అప్పగించారు. అందులోని డేటాను డిలీట్ చేసినట్లు అధికారులు గుర్తించారు. మరో ఫోన్ గురించి అడిగితే.. అది అమెరికా(America)లో ఉందని ప్రభాకర్‌రావు చెప్పారు. దీంతో తనని తెప్పించాలని అధికారులు ఆయనను ఆదేశించారు.
Phone Tapping Case | అరెస్టు చేస్తారా..
ఫోన్ ట్యాపింగ్ కేసు భయంతో అమెరికా పారిపోయిన ప్రభాకర్‌రావు.. సుప్రీంకోర్టు అరెస్టు(Supreme Court) నుంచి రక్షణ కల్పించడంతో తిరిగి వచ్చారు. అయితే ఆయన అధికారుల విచారణకు సహకరించడం లేదని తెలుస్తోంది. దీంతో ఆయనను అరెస్ట్ చేయాలని సిట్ అధికారులు(SIT Officers) భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి ఆయన అరెస్ట్‌కు అనుమతి కోరాలని చూస్తున్నారు.
Phone Tapping Case | తీన్మార్ మల్లన్నకు నోటీసులు
ఫోన్ ట్యాపింగ్ అంశంలో నిందితులను విచారిస్తున్న సిట్.. బాధితుల వాంగ్మూలాన్ని కూడా రికార్డు చేసింది. ఇప్పటికే పలువురు ప్రతిపక్ష నాయకుల స్టేట్మెంట్ను అధికారులు రికార్డు చేశారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న(MLC Teenmar Mallanna)కు కూడా అధికారులు నోటీసులు ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన ఫోన్ ట్యాప్ అయినట్లు గుర్తించిన అధికారులు ఈ నెల 17న విచారణకు రావాలని కోరారు.