అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sita Navami celebrations : సీతా నవమిని పురస్కరించుకొని ఎల్లారెడ్డి లోని బిందర్ లో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీతారాముల చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మాతృమూర్తులు మాట్లాడుతూ.. సీతా మాతను హిందూ ధర్మంలో స్త్రీ తత్వానికి ఆదర్శంగా పరిగణిస్తారని తెలిపారు. ఆమె విధేయత, పవిత్రత, సహనం, ధైర్యం వంటి లక్షణాలను స్త్రీలు స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఎల్లారెడ్డి కార్యకర్తలు, చిన్నారులు పాల్గొన్నారు.