More
    Homeబిజినెస్​Today Gold Price | త‌గ్గిన బంగారం.. పెరిగిన వెండి ధ‌ర.. ఈ రోజు ఎంతంటే..!

    Today Gold Price | త‌గ్గిన బంగారం.. పెరిగిన వెండి ధ‌ర.. ఈ రోజు ఎంతంటే..!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : ఇండియా, పాకిస్తాన్ యుద్ధం(India-Pakistan war) తర్వాత బంగారం Gold ధరల్లో కాస్త హెచ్చుత‌గ్గులు మ‌నం గ‌మ‌నిస్తూ ఉన్నాం. ఏప్రిల్ నెలలో లక్షకు చేరిన స్వచ్ఛమైన బంగారం(Pure gold).. యుద్ధం తర్వాత భారీగా తగ్గుతూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా 97 వేలకు పడిపోయింది. అంతేకాదు.. ప్రతీ రోజూ బంగారం ధరలు ఎంతో కొంత తగ్గుతూ, కొంత పెరుగుతూ ఉన్నాయి. బంగారం కొనాలనుకునే వారికి భారీ ఊరట నిస్తున్నాయి. అయితే, ఈ తగ్గుదల ఎప్పటి వరకు ఉంటుందన్నది చెప్పలేం. బంగారం కొనాలనుకునేవారు ధరలు మళ్లీ పెరగక ముందే కొని పెట్టుకోవటం మేలు. ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు బంగారు నిల్వ, వడ్డీ రేట్లపై కూడా ధ‌ర‌లు ఆధారపడి ఉంటాయి. ఈ నేపథ్యంలో నేడు(జూన్ 11వ తేదీ) బుధవారం తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలతో పాటు దేశ వ్యాప్తంగా ఉన్న ప్రధాన నగరాల్లో పసిడి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

    READ ALSO  Hydraa | వరదల కట్టడికి హైడ్రా కీలక నిర్ణయం.. రంగంలోకి మాన్సూన్ టీమ్స్

    Today Gold Price : పెరుగుతున్న వెండి ధ‌ర‌లు..

    హైదరాబాద్(Hyderabad)లో పసిడి ధర బుధవారం కూడా స్వల్పంగా తగ్గింది. ఈ రోజు 22 క్యారెట్ల (22 carat) 10 గ్రాముల బంగారం ధర రూ. 89,440ఉండగా.. 24 క్యారెట్ల10 గ్రాముల(24 carat) 10 grams బంగారం ధర రూ. 97,570లకు దిగి వచ్చింది. దాదాపు ఇవే ధరలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ప్రధాన నగరాలైన విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, పొద్దుటూరు, వరంగల్ లో కొనసాగుతున్నాయి. దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 97,570లు ఉండగా.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.89,440గా కొనసాగుతోంది.

    దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లో 24 క్యారెట్ల 10 గ్రాముల (24 carat) 10 grams బంగారం ధర రూ. 97,720లుగా ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 89,590గా ఉంది. చెన్నైలో 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్ల ధర రూ. 97,570లకు చేరుకుంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.89,440గా ఉంది. ఇవే ధరలు బెంగళూరు (Bangalore), కేరళKerala, కోల్ కతా (Kolkata), పూణే (Pune) వంటి ప్రధాన నగరాల్లో కూడా కొనసాగుతున్నాయి. ఇక బంగారం త‌ర్వాత వెండి (Silver) కొనుగోలుకు ప్రాధాన్య‌త‌నిస్తున్నారు. అయితే బంగారం క్రమంగా దిగి వస్తుండగా వెండి ధర మాత్రం షాక్ ఇస్తూ పైపైకి చేరుకుంటుంది. ఈ రోజు హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో కేజీ వెండి ధర స్వల్పంగా అంటే వంద రూపాయలు మేర పెరిగింది. దీంతో ఈ రోజు కేజీ వెండి ధర రూ. 1,19,100లకు చేరుకుంది.

    READ ALSO  Stock Markets | స్టాక్‌ మార్కెట్లలో లాభాలకు బ్రేక్.. ఫ్లాట్‌గా ముగిసిన సూచీలు

    Latest articles

    Lok Adalat | లోక్ అదాలత్​లో 1,840 కేసుల పరిష్కారం

    అక్షరటుడే, కామారెడ్డి: Lok Adalat | జిల్లా కేంద్రంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ ద్వారా 1,840 కేసులకు...

    Plane Crash | ఎయిరిండియా కీలక నిర్ణయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Plane Crash | అహ్మదాబాద్​ విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) నేపథ్యంలో ఎయిర్​...

    International Education City | ముంబైలో తొలి అంతర్జాతీయ విద్యానగరం.. క్యాంపస్లు ప్రారంభించనున్న అగ్రశ్రేణి వర్సిటీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: International Education City | మహారాష్ట్రను అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత విద్యకు కేంద్రంగా నిలిపేందుకు...

    IAS Rajiv gandhi Hanumanthu | అందరి సహకారంతో జిల్లాను ముందంజలో ఉంచాం

    అక్షరటుడే, ఇందూరు: IAS Rajiv gandhi Hanumanthu | అందరి సహకారంతో నిజామాబాద్​ జిల్లాను రాష్ట్రంలో ముందంజలో ఉంచామని...

    More like this

    Lok Adalat | లోక్ అదాలత్​లో 1,840 కేసుల పరిష్కారం

    అక్షరటుడే, కామారెడ్డి: Lok Adalat | జిల్లా కేంద్రంలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ ద్వారా 1,840 కేసులకు...

    Plane Crash | ఎయిరిండియా కీలక నిర్ణయం

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Plane Crash | అహ్మదాబాద్​ విమాన ప్రమాదం (Ahmedabad Plane Crash) నేపథ్యంలో ఎయిర్​...

    International Education City | ముంబైలో తొలి అంతర్జాతీయ విద్యానగరం.. క్యాంపస్లు ప్రారంభించనున్న అగ్రశ్రేణి వర్సిటీలు

    అక్షరటుడే, వెబ్​డెస్క్​: International Education City | మహారాష్ట్రను అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత విద్యకు కేంద్రంగా నిలిపేందుకు...