అక్షరటుడే, వెబ్‌డెస్క్: Sigachi : సిగాచీ పరిశ్రమ (Sigachi industry) ప్రమాద బాధిత కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారింది. తమ వాళ్లు ఉన్నారో, లేదో తెలియక బాధిత కుటుంబ సభ్యులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
సంగారెడ్డి జిల్లా (Sangareddy district) పాశమైలారం (Pashamilaram) లోని సిగాచీ పరిశ్రమలో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం తీవ్ర ప్రాణ నష్టాన్ని కలిగించింది. పొట్ట కూటికోసం పనికి వెళ్లిన కార్మికుల జీవితాలను బుగ్గి చేసింది. కాగా, ప్రమాదం జరిగి నాలుగు రోజులైనా తమవారి ఆచూకీ లభించలేదని బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
తమ వాళ్లు బతికున్నారో.. లేదో తెలియడం లేదని.. తమవారి ఆచూకీ తెలపాలంటూ బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. నాలుగు రోజులుగా పరిశ్రమ వద్ద పడిగాపులు కాస్తున్నా పట్టించుకునే వారే లేరంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.
Sigachi : రాయితో తల పగలగొట్టుకున్న ఓ బాధిత తండ్రి..
ప్రమాదం జరిగిన చోట చెత్త తొలగించారని బాధితులు చెబుతున్నారు. ఆ తర్వాత చేపట్టాల్సిన సహాయక చర్యల్లో మాత్రం తాత్సారం చేస్తున్నారంటూ వాపోతున్నారు. హైడ్రా లాంటి వ్యవస్థలున్నా ఎందుకు ఆలస్యం అవుతోందని అధికారులను నిలదీస్తున్నారు. ప్రమాదంలో కనిపించకుండా పోయిన జస్టిన్ ఆనే కార్మికుడి తండ్రి తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. తమ కొడుకు ఏమయ్యాడో చెప్పాలంటూ రాయితో తల పగలగొట్టుకున్నారు. అధికారులు అతడికి ఆసుపత్రిలో చికిత్స అందించారు.
పరిశ్రమ బాధితుల్లో బిహార్ Bihar కార్మికులు ఉండటంతో ఆ రాష్ట్ర అధికారులు వచ్చారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి వివరాలు సేకరించారు. మరణించిన కార్మికుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా, తమవారు
కనిపించడం లేదని బాధితుల కుటుంబ సభ్యులు ఇంకా ఫొటోలు పట్టుకుని తిరుగుతున్నారు. మరికొందరు డీఎన్ఏ DNA ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.