అక్షరటుడే, వెబ్డెస్క్: Shubanshu Shukla | ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లో (International Space Center) భారత వ్యోమగామి శుభాంశు శుక్లా అంతరిక్షంలోకి దూసుకెళ్లాడు. యాక్సియం–4 ప్రాజెక్టులో భాగంగా నలుగురు వ్యోమగాములతో బుధవారం మధ్యాహ్నం బయలు దేరిన ఫాల్కన్-9 రాకెట్ 28 గంటల ప్రయాణం తర్వాత అంతరిక్షానికి చేరుకుంది. SpaceX క్రూ డ్రాగన్ క్యాప్సూల్, గురువారం సాయంత్రం 4:03 గంటలకు ISSతో విజయవంతంగా డాక్ చేయబడింది. దీంతో నలుగురు వ్యోమగాములు స్పేస్ సెంటర్లో అడుగు పెట్టారు. వీరు 14 రోజుల పాటు సుమారు 60 ప్రయోగాలు చేయనున్నారు.
Shubanshu Shukla | 41 ఏళ్ల తర్వాత..
భారత్కు చెందిన వ్యోమగామి రాకేశ్ శర్మ 41 ఏళ్ల క్రితం అంతరిక్షంలోకి వెళ్లారు. ఇప్పుడు తాజాగా శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్రకు బయల్దేరారు. 28 గంటల ప్రయాణం తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధన కేంద్రానికి ఆయన నేతృత్వంలోని బృందం చేరుకుంది. వీరు 14 రోజుల పాటు అంతరిక్ష కేంద్రంలో ఉండనున్నారు. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడి స్పేస్ సెంటర్(NASA Kennedy Space Center) నుంచి రాకెట్ నింగిలోకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే.